![]() |
![]() |

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్.. నటుడిగానూ సత్తా చాటుతున్నాడు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ 'గాయపడ్డ సింహం'(Gaayapadda Simham). తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని రివీల్ చేశారు మేకర్స్.
కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్ లో 'గాయపడ్డ సింహం' రూపొందుతోంది. ఈ సినిమాని మే 1, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ ప్రకటన ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే దానికి ఒకరోజు ముందుగా అంటే ఏప్రిల్ 30న 'పెద్ది'(Peddi) విడుదల ఉంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందుతోన్న 'పెద్ది' సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, పోస్ట్ పోన్ పై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. అయినప్పటికీ అదే సమయంలో బాక్సాఫీస్ బరిలో 'గాయపడ్డ సింహం' దిగడం సంచలనంగా మారింది. 'పెద్ది' వాయిదా పడుతుందన్న నమ్మకమా? లేక కంటెంట్ మీద నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

కాశ్యప్ శ్రీనివాస్ కొత్త దర్శకుడైనా, తన ప్రతిభతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడు. 'గాయపడ్డ సింహం' టీజర్, ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ఆమె ఎలా నటిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తరుణ్ భాస్కర్ నటించిన గత చిత్రం 'ఓం శాంతి శాంతి శాంతిః' నిరాశపరిచింది. అందుకే 'గాయపడ్డ సింహం' రిజల్ట్ ఆయనకు కీలకం కానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే, నటుడిగా తరుణ్ భాస్కర్ కి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది.
![]() |
![]() |