![]() |
![]() |

ఇటీవల సినిమాల ఫేక్ కలెక్షన్ పోస్టర్స్, బుక్ మై షో ఫేక్ రేటింగ్స్ పై విపరీతంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఆయన నిర్మించిన 'నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 సాయంత్రం థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ రెండు అంశాలపై స్పందించారు.
"కలెక్షన్ పోస్టర్స్ రిలీజ్ చేయడం అనేది నిర్మాతల వ్యక్తిగతం. నా వరకు నేను ఎప్పుడో ఆపేశాను. ఎవరికి వాళ్ళు ఆపేస్తారు. ఒకప్పుడు ప్రెజర్ ఉండేది. దానిని ఒక పబ్లిసిటీ స్టంట్ కింద తీసుకునేవాళ్ళం. గ్రాస్ కి, షేర్ కి తేడా తెలియనివాళ్ళు చాలామంది ఉన్నారు. దూకుడు సినిమా వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని పోస్టర్ వేశాం. అది చూసి మీకు వంద కోట్లు వచ్చేశాయా అన్నారు. వంద కోట్లు అంటే అందులో మాకు వచ్చేది నలభై. అది తెలీదు ఎవరికీ. ఆడియన్స్ ఆ నెంబర్ చూసి అట్రాక్ట్ అవుతారు కదా. అది ఓ రకంగా ప్రమోషనల్ స్ట్రాటజీ. అయితే ఇప్పుడది మిస్ ఫైర్ అవుతుంది. మేము పోస్టర్స్ వేయడం మానేశాము." అని కలెక్షన్ పోస్టర్స్ పై అనిల్ సుంకర తన అభిప్రాయాన్ని తెలిపారు.
https://x.com/Theteluguone/status/2010970920945594609?s=20
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
ఇక బుక్ మై షోలో రివ్యూలు, రేటింగ్ లపై కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడంపై అనిల్ సుంకర స్పందిస్తూ.. "బుక్ మై షో వంటి యాప్స్ లో లైక్స్, రేటింగ్స్ కావాలంటే డబ్బులు కట్టాలి. ఎక్కువ రేటింగ్ కావాలంటే ఇంత ప్యాకేజ్ తీసుకోవాలి అనే లెక్కలు ఉంటాయి. అది వాళ్ళ బిజినెస్. కానీ దాని వల్ల నిర్మాతలకు నష్టం జరుగుతుంది. అందుకే దీనికి బ్రేకులు వేయాలి అనుకున్నాం. ఆ దిశగా చిరంజీవి గారి సినిమా అడుగు వేసింది. మేము దానిని కొనసాగిస్తాం." అన్నారు.
https://x.com/Theteluguone/status/2010973549423706119?s=20
![]() |
![]() |