![]() |
![]() |

-సినీ చరిత్రలో ఇదే తొలి తీర్పా!
-కోర్టు తీర్పు వెనక మర్మం ఏంటి!
-కార్తీ అభిమానులు ఏమంటున్నారు
తమిళ, తెలుగు నాట సమానమైన ఫాలోయింగ్ కలిగిన కార్తీ 'వా వాతియార్'( Vaa vaathiyaar)అనే మూవీని కంప్లీట్ చేసి అభిమానుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలుగు టైటిల్ 'అన్నగారు వస్తున్నారు'. డిసెంబర్ 12 నే రిలీజ్ కావలసి ఉండగా, చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా 2011లో ఒక మూవీకి సంబంధించి అర్జున్ లాల్ సుందర్‌దాస్ అనే ఫైనాన్సియర్ నుండి 10.35 కోట్లు అప్పుగా తీసుకున్నారు. సదరు అమౌంట్ వడ్డీతో కలిపి దాదాపుగా 21.78 కోట్ల రూపాయలకి చేరింది. దీంతో అర్జున్ లాల్ చెన్నైలోని హైకోర్టులో జ్ఞానవేల్ రాజా పై పిటిషన్ వేసాడు. సదరు పిటిషన్ లో తనకి రావాల్సిన అమౌంట్ చెల్లించే వరకు వా వాతియార్ రిలీజ్ ని నిలిపివేయాలని కోరాడు. దీంతో వా వాతియార్ రిలీజ్ పై కోర్టు స్టే విధించింది. స్టే ఆర్డర్‌ని సవాలు చేస్తూ జ్ఞానవేల్ రాజా సుప్రీంకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రీసెంట్ గా హైకోర్టు వా వాతియార్ విషయంలో ఎవరు ఊహించని విధంగా సరికొత్త తీర్పుని ప్రకటించింది.
జ్ఞానవేల్ రాజా చెల్లించాలిసిన 21.78 కోట్ల రూపాయలని ఫైనాన్షియర్‌కి తిరిగి చెల్లించడానికి, వా వాతియార్ హక్కులని బహిరంగంగా వేలం వేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
గతంలో ఫైనాన్సియల్ ఇష్యూ తలెత్తడంతో చాలా సినిమాలు కోర్టు గుమ్మం ఎక్కాయి. కానీ సినిమా హక్కులని బహిరంగంగా వేలం వేసి ఫైనాన్సియర్ కి అమౌంట్ ఇవ్వాలని చెప్పడం బహుశా ఇదే తొలి సారి ఏమో. అదే విధంగా కోర్టు తన తీర్పులో బకాయిలు చెల్లించే వరకు, OTT మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, థియేటర్లలో సినిమా విడుదలని కోర్టు శాశ్వతంగా నిలిపివేసున్నట్టుగా కూడా హై కోర్టు తన తీర్పులో తెలిపింది. ఈ తీర్పుతో కార్తీ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.
Also read: The raja saab: ది రాజాసాబ్ మూవీ రివ్యూ
వా వాతియార్ లో కార్తీ డిఎస్ పి రామేశ్వరన్ గా కనిపిస్తుండగా, కార్తీ(karthi)సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి(Krithi shetty)జత కట్టింది. సత్యరాజ్, రాజ్ కిరణ్, కరుణా కరణ్ ముఖ్యమైన క్యారెక్టర్స్ ని పోషించాడు. నలన్ కుమారస్వామి(Nalan Kumaraswami)దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా(Ke Jnanavel Raja)సుమారు 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్టుగా టాక్. కార్తీకి జ్ఞానవేల్ రాజా సోదరుడి వరుస అవుతాడు.
![]() |
![]() |