![]() |
![]() |

'ది రాజా సాబ్' రూపంలో మారుతికి గొప్ప ఛాన్స్
పిలిచి అవకాశమిచ్చిన ప్రభాస్
ఆ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకున్నాడా?
2012లో 'ఈరోజుల్లో' సినిమాతో దర్శకుడిగా పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించిన మారుతి.. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజూ పండగే వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. మారుతి ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేశాడు. మధ్యలో వెంకటేష్ తో 'బాబు బంగారం' చేసినప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అలాంటి మారుతికి 'ది రాజా సాబ్'తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగిపోయే అవకాశమిది. కానీ, ఆ అవకాశాన్ని మారుతి సరిగ్గా వినియోగించుకోలేకపోయాడనే చెప్పాలి. (The Raja Saab)
మారుతితో ప్రభాస్ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు ఫ్యాన్స్ తో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ స్టార్డమ్ ని మారుతి హ్యాండిల్ చేయగలడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ తో హారర్ కామెడీ జానర్ లో ఫిల్మ్, వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నారనే ప్రకటనలతో చిన్నగా నమ్మకం మొదలైంది. ఇక ప్రభాస్ లుక్స్, ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై హోప్ వచ్చింది. తీరా రిలీజ్ అయ్యాక డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.
Also Read: 'రాజా సాబ్' మూవీలో హైలైట్స్ ఇవే!
తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన 'ది రాజా సాబ్' మూవీ బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. రివ్యూలు గొప్పగా లేవు. జనరల్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రభాస్ తో కొత్త జానర్ లో సినిమా చేయాలనే ఆలోచన బాగుంది. స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది. కానీ, ఎగ్జిక్యూషన్ లో మారుతి తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ లో ల్యాగ్, సెకండ్ హాఫ్ లో కన్ఫ్యూజన్ సినిమాకి ప్రధాన సమస్యగా మారాయి. ప్రభాస్ వన్ మ్యాన్ షో, ఇంటర్వెల్, క్లైమాక్స్ తప్ప సినిమాలో పెద్దగా వావ్ మూమెంట్స్ లేవు. ఒకే సినిమాలో ఎక్కువ అంశాలు చెప్పడానికి ప్రయత్నించకుండా.. ఈ కాన్సెప్ట్ కి తగ్గట్టు సరైన స్క్రీన్ ప్లేని రాసుకొని ఉంటే.. అవుట్ పుట్ మరోలా ఉండేది. అదే జరిగి, రాజా సాబ్ తో మారుతి మ్యాజిక్ చేసి ఉంటే.. పాన్ ఇండియా వైడ్ గా ఆయన పేరు మారుమోగిపోయేది. కానీ, ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని మారుతి సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు.
![]() |
![]() |