![]() |
![]() |
.webp)
హాట్ టాపిక్ గా మారిన పూనమ్ కౌర్ కామెంట్స్..
15 కోట్లు ఇస్తాం హీరోని తిట్టమన్నది ఎవరు .?
తన పెళ్ళి ఆగిపోవటానికి కారణం ఎవరు.?
వాచ్ థిస్ స్టోరీ
తెలుగు ప్రేక్షకులు తనని గుర్తుంచుకునే రీతిలోనే సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ ని కనపర్చిన నటి 'పూనమ్ కౌర్'(Poonam Kaur).ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు తగ్గినా బుల్లి తెరపై కొన్ని షోస్ ద్వారా అభిమానులని అలరిస్తూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా చేసే ట్వీట్స్ ద్వారా గాని, మీడియాకి ఇచ్చే ఇంటర్వూస్ లో గాని పూనమ్ పలు సంచలన విషయాలు వెల్లడి చేస్తుందనే విషయం తెలిసిందే. రీసెంట్ గా మరో సారి కొన్ని సంచలన విషయాలు చెప్పి వార్తల్లో నిలిచింది.
ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతు తమ రాజకీయ లబ్ధి కోసం కొన్ని పొలిటికల్ పార్టీలు నన్ను వాడుకోవాలని చూశాయి.పదిహేను కోట్ల రూపాయిల డబ్బులు ,పదవులు ఆఫర్ చేయడంతో పాటు కడప కి చెందిన వ్యక్తులు బెదిరింపులకి దిగారు. ఒక బడా యాక్టర్ కి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా అశ్లీల వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేస్తామని అన్నారు. ఆ తర్వాత నా గురించి అన్ని తెలిసిన నా స్నేహితుడు నన్నుపెళ్లి చేసుకుంటాను అన్నాడు. అదే సమయంలో రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)ప్రెస్ మీట్ నిర్వహించి నాపై చెడ్డగా, కట్టుకథలు అల్లడం వల్ల నా స్నేహితుడు నన్ను పెళ్లి చేసుకోలేదు.
Also read: ఏమిటి ఈ అన్యాయం.. ఫ్యాన్స్ ఆవేదన నిజమేనా!
జీవితం పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది. డబ్బు, పని అవకాశాలు, ఆరోగ్యం, సంతోషం, ఆశ అన్నింటినీ కోల్పోయాను. గురుద్వారాకు వెళ్లిన మా అమ్మని డబ్బుల కోసం కూతురిని అమ్మేశావా అంటూ చాలా మంది నిలదీశారు. ఆ మాటలు తట్టుకోలేక మా అమ్మ తీవ్రంగా కుంగిపోయింది. నేను ఎవరినుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. బంధువులు కూడా నన్ను నమ్మలేదు. ఈ అనుభవాలన్నీ నా జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని పూనమ్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి.
![]() |
![]() |