![]() |
![]() |

-ఏం మాట్లాడాడు
-తేజ నెక్స్ట్ చిత్రం ఏంటి
-మన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది
ఇప్పుడు 'తేజ సజ్జ'(Teja Sajja)పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న హీరో. ఒకే ఒక్క చిత్రం హనుమాన్(Hanuman)తో ఆ స్థాయి క్రేజ్ ని సంపాదించాడు. సదరు క్రేజ్ ఎట్టి పరిస్థితుల్లోను ఆగదు అనే రీతిలో రీసెంట్ హిట్ 'మిరాయ్' తో నిరూపించాడు. ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీతో అభిమానులు,ప్రేక్షకుల ముందుకు రావడానికి కథలు వింటున్నట్టుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో కొత్త సినిమాపై ప్రకటన వస్తుందనే మాటలు కూడా వినపడుతున్నాయి. రీసెంట్ గా తేజ సజ్జ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనపై కొంత మంది చేస్తున్న ట్రోల్ల్స్ తో పాటు పలు కీలక విషయాలపై మాట్లాడటం జరిగింది.
తేజ మాట్లాడుతు పెద్ద పెద్ద హీరోలతో పాటు నేషనల్ అవార్డు వచ్చిన చిత్రాలని సైతం ట్రోల్ చేస్తుంటారు. ట్రోల్ల్స్ చేస్తున్నారని ఆగిపోకూడదు. ముందుకెళ్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మన విలువ తెలియడం గ్యారంటీ. మనం చేయాల్సింది. టాలెంట్ పై నమ్మకం ఉంచుకొని ముందుకెళ్లటమే. పది సంవత్సరాల తర్వాత అయినా అసలు నిజం ఏంటో తెలుస్తుంది. అలాగే ఒకేసారి పెద్ద హీరో అయిపోవాలని అనుకోకూడదు.మనతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగించాలి.
Also read: ఆరు చిత్రాలతో ప్రేక్షకుల్లో పండుగ.. విన్నర్ ఈ చిత్రమే
రవితేజ గారు పది సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. అంత కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు స్టార్ స్థానంలో ఉన్నారు. నా యాక్టింగ్ విషయానికి వస్తే హనుమాన్ చేసిన టైంలో బాగా చేసానని అనుకున్నాను. మిరాయ్(Mirai)లో చూసుకుంటే హనుమాన్ కంటే బెస్ట్ గా చేసానని అనిపించింది. ఇక ముందు కూడా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తేజ సజ్జ చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |