![]() |
![]() |

-గెలిచింది ఏ మూవీ
-ప్రేక్షకులు ఏం చెప్తున్నారు
-టాక్ ఎలా ఉంది
-కలెక్షన్స్ ఎలా ఉన్నాయి
ఒక్కొక్కొళ్ళకి ఒక్కో టైం వస్తుందనే ప్రకృతి ధర్మం చెప్పే మాట నిన్న మరోసారి సాక్ష్యాలతో సహా నిరూపితమైంది. మరి ఒకటా, రెండా ఏకంగా ఐదు చిత్రాలు సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాయి. దీంతో డిసెంబర్ 25 సినీ ప్రేమికుల టైం అని చెప్పుకోవచ్చు. మరి ఒకటా, రెండా ఏకంగా ఐదు చిత్రాలు సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాయి. దీంతో డిసెంబర్ 25 సినీ ప్రేమికుల టైం అని చెప్పుకోవచ్చు. శంబాల(shambhala),ఛాంపియన్(champion),వృషభ(Vrusshabha),దండోరా(Dhandoraa),ఈషా(eesha),పతంగ్(Pathang)ఇలా మొత్తం ఆరు చిత్రాలు. మరి ఈ చిత్రాల్లో ఏ మూవీకి ప్రేక్షకుల నుంచి తొలి రోజు రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాం.
జనరల్ గా ఆరు చిత్రాల వరకు రిలీజైనప్పుడు కొన్ని చిత్రాలకి నెగిటివ్ టాక్ రావడం సహజం. కానీ ఈ సారి అనూహ్యంగా ఒక్క చిత్రానికి మాత్రమే పూర్తి స్థాయి నెగిటివ్ టాక్ వస్తుంది. ఆ చిత్రమే 'వృషభ'. అన్ని భాషల్లోను డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.కలెక్షన్స్ పరంగా కూడా మోహన్ లాల్ తో సహా అందరకి షాక్ ఇస్తు తొలి రోజు 70 లక్షలని మాత్రమే రాబట్టింది. దీంతో పోటీ నుంచి దాదాపుగా వృషభ తప్పుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మిగతా చిత్రాలైన శంబాల, ఛాంపియన్, దండోరా, ఈషా, పతంగ్ ఇలా అన్ని చిత్రాలు పర్వాలేదనే స్థాయిలో స్పందనని రాబట్టుకున్నాయి. కలెక్షన్స్ విషయంలో కూడా ఇంచు మించు పోటాపోటీగా వెళ్తున్నాయి.
Also read: వృషభ ఫస్ట్ డే ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే.. ఫామ్ లోనే ఉన్నాడు కదా
దీంతో మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా సదరు చిత్రాల గురించి మాట్లాడుతూ వృషభ తప్ప మిగిలిన చిత్రాల్లో కలెక్షన్స్ ఏ చిత్రానికీ ఎక్కువ వస్తాయో ఆ చిత్రం ఎక్కువ విజయం సాధించే సినిమాగా నిలిచినట్లే అని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |