ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరో అనే ఒక పాట ఉంటుంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)ఒన్ మాన్ షో పుష్ప 2(pushpa 2)రిలీజ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఏ నిమిషానికి ఏ కొత్త డేట్ వస్తుందో అర్ధం కాకుండా పోయింది. రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ విషయంలో కొన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి.
పుష్ప పార్ట్ 1 హిట్ కావడంతో పుష్ప 2 పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని కుదిరి ఉంటే ఈ పాటికి ట్రైలర్ రిలీజ్ అయ్యి అగస్ట్ 15 ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తుండే వాళ్ళు. షూటింగ్ ప్రారంభం అయిన రోజునే అగస్ట్ 15 డేట్ అనౌన్స్ అయ్యింది. బన్నీకి దర్శకుడు సుకుమార్ కి ఉన్న బాండింగ్ దృష్ట్యా అగస్ట్ 15 లాండింగ్ పక్కా అని అనుకున్నారు. కానీ డిసెంబర్ 6 కి వాయిదా పడింది. ఇప్పుడు ఈ డేట్ కూడా మారబోతుందనే రూమర్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే ఏడాది వేసవికి పుష్ప షిఫ్ట్ అయ్యాడని ఈ మేరకు త్వరలోనే అధికార ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. మరి ఈ విషయంలో పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే.
ఇక కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఆ లుక్ చూసిన వాళ్లకి క్లియర్ గా అర్ధమవుతుంది. అది పుష్ప లుక్ కాదని. దీంతో పుష్ప దర్శకుడు సుకుమార్ కి, బన్నీ కి మధ్య మనస్పర్థలు వచ్చాయని దీంతో షూటింగ్ వాయిదాపడిందనే వార్తలు వచ్చాయి.ఇంకో అడుగు ముందుకేసి సుకుమార్(sukumar)అలిగి ఫారెన్ వెళ్లాడనే వార్తలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా ప్రస్తుతానికి అయితే షూటింగ్ జరుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం. షూటింగ్ అప్ డేట్ మాత్రం కొన్ని రోజుల నుంచి రావడం లేదు. రెండు సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అవి రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా బన్నీ సరసన రష్మిక జోడీకడుతుంది.ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.