Home  »  News  »  29 ఏళ్ళ ఏజ్ గ్యాప్ హీరోతో మీనాక్షి చౌదరి.. ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందా!

Updated : Aug 4, 2026

 

 

మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary).. ఎనీ హీరో మీనాక్షి డేట్స్ ఖాళీగా ఉన్నాయేమో చూడండనే పరిస్థితి. అంతలా లక్కీ హీరోయిన్ హోదాలో దూసుకుపోతుంది. సితార లాంటి అగ్ర నిర్మాణ సంస్థ మీనాక్షి లేకుండా సినిమా తెరకెక్కించే పరిస్థితి లేదు. దీన్ని బట్టి ఈ ముద్దు గుమ్మ హవాని అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఇటీవల కాలంలో మీనాక్షి చౌదరి పేరు సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దానికి కారణం ఆమె నటిస్తున్న చిత్రాల్లోని హీరోలతో ఏజ్ గ్యాప్. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోల సరసన ఆమె వరుసగా అవకాశాలు దక్కించుకోవడం సినీ విశ్లేషకులను, అభిమానులను విస్తుపోయేలా చేస్తోంది. ఉదాహరణకు, 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో నటించింది.  వెంకటేష్ వయస్సు ప్రస్తుతం 64 ఏళ్లు కాగా మీనాక్షి వయస్సు 27 ఏళ్ళు. అంటే వెంకటేష్‌కు, మీనాక్షికి మధ్య దాదాపు 36 నుంచి 37 ఏళ్ల భారీ వయసు వ్యత్యాసం ఉంది. 


Also read: ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్.. ఫ్యాన్స్ లో కలవరం 

ఇది కేవలం ఒక్క సినిమాకే పరిమితం కాలేదు. తమిళ సూపర్‌స్టార్ విజయ్ 50 ఏళ్ల వయస్సులో నటించిన 'GOAT' చిత్రంలోను  మీనాక్షి కథానాయికగా అలరించింది. అక్కడ కూడా వారి మధ్య దాదాపు 23 ఏళ్ల వయస్సు తేడా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతూ అక్షయ్ కుమార్ సరసన బాగం బాగ్ 2 తో జత కడుతుంది. అక్షయ్, మీనాక్షి మధ్య ఏజ్ గ్యాప్ 29 సంవత్సరాలు. ఈ విధంగా టాలీవుడ్, కోలీవుడ్ఎం బాలీవుడ్  అనే తేడా లేకుండా దాదాపు 25 నుంచి 30 ఏళ్లకు పైగా వయస్సు వ్యత్యాసం ఉన్న సీనియర్ హీరోల పక్కన జోడీగా నటించేందుకు మీనాక్షి అంగీకరించడం గమనార్హం. సాధారణంగా 20 ఏళ్ల వయస్సు తేడా ఉన్నప్పుడే నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ ఏకంగా 30 ఏళ్లకు పైగా వ్యత్యాసం ఉన్నప్పటికీ మీనాక్షి గ్లామర్ అండ్ యాక్టింగ్ టాలెంట్ వల్ల ఈ కాంబినేషన్లు తెరపై బాగా వర్కవుట్ అవుతుండడం విశేషం.మీనాక్షి స్వస్థలం  హర్యానా. 2021లో 'ఇచట వాహనములు నిలపరాదు' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైంది. 

  Meenakshi chaudhary, Akshay Kumar
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.