దుల్కర్ సల్మాన్(dulquer salmaan)మీనాక్షి చౌదరి(meenakshi chaudhary)జంటగా దివాలి కానుకగా అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ లక్కీ భాస్కర్(lucky baskhar)దుల్కర్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ విడుదలైన అన్ని చోట్ల విజయ పధానా దూసుకుపోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు కోట్ల నలబై లక్షలు, తమిళనాడు లో నలబై లక్షలు,మలయాళం కోటి ఎనభై లక్షలు,కర్ణాటక లక్ష రూపాయలు వసూలు చేసింది. అలాగే ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా తొంబై లక్షలుని రాబట్టింది.ఇలా ఇండియా వైడ్ గా మొత్తం ఏడూ కోట్ల యాభై లక్షల రూపాయిల నెట్ కలెక్షన్స్ ని సాధించింది.
సితార ఎంటర్ టైన్మెంట్స్, మరియు ఫార్చ్యూన్ సినిమాస్ పై సూర్య దేవర నాగవంశీ, సౌజన్య నిర్మించగా వెంకీ అట్లూరి దర్శకుడుగా వ్యవహారించాడు. ముంబై నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రాంకీ, లక్ష్మి, సర్వదామన్ డి బెనర్జీ,సచిన్ ఖేడ్ కర్, సాయి కుమార్, టిల్లు ఆనంద్, శివ నారాయణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో చేసారు.