![]() |
![]() |

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందిన 'ఇస్మార్ట్ శంకర్' 2019 జులైలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ మాస్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ రాబోతుంది. 'డబుల్ ఇస్మార్ట్' కోసం మరోసారి రామ్, పూరి చేతులు కలిపారు.
రామ్-పూరి కాంబోలో మరో సినిమా రానుందని కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. అది 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెలా? లేక కొత్త కథనా? అనే చర్చలు కూడా జరిగాయి. అయితే ఇది 'ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్ అని క్లారిటీ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు(మే 15) కానుకగా ఒకరోజు ముందుగానే.. రామ్-పూరి కాంబోలో రానున్న రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రానికి 'డబుల్ ఇస్మార్ట్' అనే టైటిల్ పెట్టారు. అంతేకాదు అప్పుడే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేశారు. 2024, మార్చి 8న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ విడుదల కానుంది.

రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. ఇది దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ సినిమా పూర్తయ్యాక పూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశముంది.
![]() |
![]() |