Home  »  News  »  ‘టాక్సిక్’ మేకింగ్‌పై యష్ అసంతృప్తి.. 100 రోజుల రీషూట్ రూమర్లపై అసలు నిజమిదే!

Updated : Jun 4, 2026

రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (Toxic) చుట్టూ గత కొన్ని రోజులుగా రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో హీరో యష్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే భారీ ఎత్తున మార్పులు చేయబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర బృందం ఈ రూమర్లకు గట్టి సమాధానం ఇస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది.

ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపించిన టాక్ ప్రకారం.. ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తీసిన కొన్ని సీన్లు యష్‌కు నచ్చలేదని, దాదాపు 100 రోజుల పాటు సినిమాను మళ్లీ రీషూట్ చేయాలని ఆయన పట్టుబట్టినట్లు గట్టిగా ప్రచారం సాగింది. అయితే, ఈ వార్తలను చిత్ర యూనిట్ వర్గాలు పూర్తిగా కొట్టిపారేశాయి. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ నిరాధారమైన పుకార్లని స్పష్టం చేశాయి.

సినిమా కంటెంట్ మరియు ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల హీరో యష్ వంద శాతం సంతృప్తిగా ఉన్నారని మేకర్స్ తెలిపారు. అసలు రీషూట్ చేయాలనే ఆలోచనే ఎవరికీ లేదని, ప్రస్తుతం సినిమా పనులు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు. బిగ్ బజెక్ట్ చిత్రాల విషయంలో ఇలాంటి నెగెటివ్ రూమర్స్ రావడం సహజమేనని, అభిమానులు వీటిని నమ్మవద్దని కోరారు.

‘కేజీఎఫ్ 2’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత యష్ నటిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘టాక్సిక్’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్‌తో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ హోమ్ బ్యానర్ ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’తో కలిసి కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్, టీజర్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. అయితే, సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడటంతోనే ఇలాంటి గాసిప్స్ పుట్టుకొచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పంపిణీ ఒప్పందాలు, గ్లోబల్ రిలీజ్ స్ట్రాటజీ వల్లే ఆలస్యం జరుగుతోందని గతంలోనే యష్ స్వయంగా వివరణ ఇచ్చారు.

ఈ రూమర్ల బారిన పడకుండా, సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో పాటు యష్ బాలీవుడ్ భారీ చిత్రం ‘రామాయణ’లో రావణుడి పాత్రలోనూ నటిస్తున్నారు. మరి ‘టాక్సిక్’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.