![]() |
![]() |
.webp)
బుల్లితెరపై యాంకర్ గా విష్ణు ప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మానస్ తో కలసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' కూడా యూట్యూబ్ లో మంచి వీక్షకాదరణ పొందుతోంది.
బిగ్ బాస్ తో మంచి ఫేమ్ సంపాదించుకున్న మానస్.. ఇప్పుడు బాగా బిజీ అయిపోయాడు. ఒకవైపు ఈవెంట్స్, మరొకవైపు రియాలిటీ షోస్ చేస్తున్న మానస్.. తాజాగా స్టార్ మా టీవీలో ప్రారంభమైన 'బ్రహ్మముడి' సీరియల్ లో నటిస్తూ మరింత బిజీ అయిపోయాడు. అయితే తాజాగా అనిల్ జీలాతో కలిసి వీరిద్దరూ ఒక ఫామ్ లాండ్ లో వీకెండ్ అంటూ కలిసారు. యూట్యూబ్ లో అత్యంత ఆదరణ కలిగిన ఛానెల్స్ లో 'మై విలేజ్ షో' ఒకటి. ఈ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వని పరిచయం చేసిన అనిల్ జీలా.. ఇప్పుడు అందరికీ సుపరిచితమే. అనిల్ జీలా పెళ్ళి లాక్ డౌన్ లో జరగడంతో.. తన పెళ్ళికి అందరినీ వాట్సప్ లో ఆహ్వానించి, చదివింపులను ఫోన్ పే, గూగుల్ పే లో పంపమని చెప్పగా ఇదంతా వ్లాగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా మంచి వీక్షకాదరణ పొందింది. దీని తర్వాత అనిల్ జీలా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.
అయితే ఈ అనిల్ జీలా, మానస్, విష్ణుప్రియ కలిసి హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్ లాండ్ లో వీకెండ్ ఈవెంట్ లాగా కలుసుకున్నారు. కాగా వీళ్ళంతా కలిసి స్పెషల్ చికెన్ చేసారు. దీనిపేరు 'బొందలో చికెన్'. ఈ చికెన్ లో ఒక్క చుక్క నూనె కూడా వాడకుండా ఈ బొందలో చికెన్ చేస్తామని చెప్పిన అనిల్ జీలా.. అలాగే చేసి విష్ణుప్రియ, మానస్ లతో వహ్వా అనిపించాడు. అయితే ఈ వీడియోని అనిల్ జీలా తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసాడు. కాగా దీనికి మంచి స్పందన వస్తుంది.
![]() |
![]() |