Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం

Updated : May 25, 2026

 

 

ఎప్పటికప్పుడు తెలుగు సినిమా న్యూస్ సరికొత్త క్రేజీ అప్ డేట్ తో మీ ముందు ఉంటున్నాయి. మరి ఈ క్రేజీ న్యూస్ ఏంటో చూసేద్దాం 

1 . హెల్లాల్లల్లో సాంగ్ రికార్డ్స్ 

మొన్న 23 న భూపాల్ సాక్షిగా పెద్ది నుంచి 'హెల్లాల్లల్లో' సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అలా విడుదలైందో లేదో రికార్డులే నా చిరునామా అంటూ యూట్యూబ్ లో  రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 18 మిలియన్లకి  పైగా వ్యూస్‌ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ సినిమా నుంచి వచ్చిన  సాంగ్ హిందీ, సౌత్ భాషల యూట్యూబ్ ట్రెండింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడం పెద్ది స్టామినా ఏ పాటిదో తెలియచేస్తుంది.

 2 . కోకాపేటలో ప్రభాస్ డ్రీమ్ హౌస్.. ఎకరం ధర వింటే షాక్ అవ్వాల్సిందే

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హైదరాబాద్  కోకాపేట ఏరియాలో తన సరికొత్త డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులని  అధికారికంగా ప్రారంభించారు. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా  భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.రెండు ఎకరాల్లో నిర్మాణం జరుపుకోనుండగా ఎకరం భూమి విలువ దాదాపు 150 కోట్లకి పైగా ఉంది.  అంటే కేవలం ఆయన కొనుగోలు చేసిన ఈ రెండు ఎకరాల ఖాళీ స్థలం విలువే 300 కోట్లు. ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ గా నిర్మాణం జరుపుకోనుంది

3 . బండ్ల గణేష్‌ని చెప్పుతో కొట్టిన టాలీవుడ్ ప్రముఖుడు.. ఫ్యాన్స్ షాక్ 

బండ్ల గణేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు స్టార్ హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రోజే నా జీవితంలో చేదు సంఘటన జరిగింది. షూటింగ్ స్పాట్‌లో ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ పెద్దమనిషి పక్కన కూర్చున్నాను. నేను “సార్' అని పిలవగానే సదరు పెద్ద మనిషి చెప్పు తీసుకుని నన్ను కొట్టాడు. అయితే ఆ సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. నా దగ్గర డబ్బు లేదు. నేను బలహీనుడిని కాబట్టే నన్ను అలా అవమానించారనిపించింది. బయటకు వచ్చిన తర్వాత నాతో ఉన్న వ్యక్తితో ఒక మాట చెప్పాను. ఒక రోజు ఆయన కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తా.. లేదంటే నా పేరు గణేష్ కాదు అని. గణేష్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

4 . పెద్ది వివాదంపై రంగంలోకి చిరంజీవి

పెద్ది' నుంచే మాకు పర్సెంటేజ్(రెవెన్యూ షేరింగ్) సిస్టంని అందుబాటులోకి తీసుకురావాల్సిందే, లేదంటే ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తీర్మానించిన విషయం తెలిసిందే. దీంతో మరో వారం రోజుల్లో పెద్ది రిలీజ్ ఉండటంతో ఫ్యాన్స్  సినీ ప్రేమికుల్లో టెన్షన్ మొదలయ్యింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి  సమస్యని  పరిష్కరించడానికి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు సాయంత్రం చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్స్ తో సమావేశం  జరగనుంది.

5 .వారణాసి క్రేజీ అప్ డేట్.. ఫ్యాన్స్ కాలర్ ఎత్తాల్సిందే 

మహేష్ బాబు, రాజమౌళిల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం "వారణాసి" (Varanasi). ఈ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ రెండో వారం నుంచి మూవీకి అత్యంత కీలకమైన సుదీర్ఘ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కంటిన్యూగా నెల రోజుల పాటు జరగనున్నట్టుగా సమాచారం 

6 .పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి  నిరాశ తప్పదా 
 
 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'పంజా' ని  రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకి  గురవుతున్నారు. 'పంజా' లో  పవన్ లుక్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాంతో చాలా మంది పవన్ అభిమానులు 'బద్రి' నే రీ రిలీజ్ చెయ్యాలని అభిప్రాయపడుతున్నారు.

7 . రోబోలు వచ్చే కాలంలో పిల్లలెందుకు.. జ‌గ‌ప‌తిబాబు షాకింగ్ కామెంట్స్


వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ వంటి టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో మానవ సంబంధాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి.  కళ్లముందే కలియుగం కనిపించడంతో పాటు భవిష్యత్తు కాలం చాలా భయంకరంగా మారబోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులున్న సమాజంలోకి కేవలం మన స్వార్థం, సంతోషం కోసం పిల్లలని  తీసుకురావడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చాడు.

8 .పెద్దిపై పోసాని షాకింగ్  కామెంట్స్‌
 పోసాని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ది’ రిలీజ్ కి  అటుఇటుగా నా కొత్త సినిమా 'ఆపరేషన్ అరుణా రెడ్డి' రిలీజ్ కానుంది.  అయితే చరణ్ సినిమా పెద్ద హిట్ కావాలని  కోరుకుంటున్నట్లు చెప్పాడు.


9 .ఫ్లాప్ హీరోల‌కి కూడా వంద‌ల కోట్లు బ‌డ్జెట్‌ అంటున్న తమ్మారెడ్డి 

పరిశ్రమలో ఎప్పుడైనా సరే కేవలం ఐదు శాతం సినిమాలు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయని, మిగిలిన తొంభై ఐదు శాతం చిత్రాలు నష్టాలనే మిగులుస్తాయని ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చెబుతున్నారు. ముఖ్యంగా హీరోల పారితోషికాల విషయంలో నిర్మాతల వైఖరి మారాలి. వరుస ఫ్లాపులు ఇస్తున్న హీరోలకి  సైతం వందల కోట్ల బడ్జెట్ కేటాయించి, భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్న నిర్మాతలు నేడు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పుకొచ్చాడు

10 .శ్రీను వైట్ల, శర్వానంద్ తో విశ్వంభర భామ!

దర్శకుడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబోలో ఒక మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.  హీరోయిన్‌ గా ఆషికా రంగనాథ్ ని  ఫిక్స్ చేసినట్లుగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న తాజా న్యూస్ . ఈ సంక్రాంతికి రవితేజతో కలిసి భర్త మహాశయులకు విజ్ఞప్తితో  మెప్పించిన  ఆషికా,మెగా స్టార్ విశ్వంభరలో కనువిందుచేయనున్న విషయం తెలిసిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.