Home  »  News  »  'టిల్లు' దెబ్బకు 'ఫ్యామిలీ స్టార్' తట్టుకోగలడా!

Updated : Apr 26, 2024

జయాపజయాలతో సంబంధం లేకుండా థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ వారం రెండు క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. అందులో ఒకటి బ్లాక్ బస్టర్ మూవీ 'టిల్లు స్క్వేర్'(Tillu Square) కాగా, మరొకటి ఫ్లాప్ గా నిలిచిన 'ఫ్యామిలీ స్టార్'(Family Star).

టిల్లు స్క్వేర్:
సూపర్ హిట్ ఫిల్మ్ 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా 'టిల్లు స్క్వేర్'. మంచి అంచనాలతో మార్చి 29న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం.. నవ్వులు పూయించి, వసూళ్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెట్టింది. నేటి(ఏప్రిల్ 26) నుండి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్యామిలీ స్టార్:
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో.. మంచి అంచనాలతో విడుదలైంది. ఏప్రిల్ 15న థియేటర్లలో విడుదలైన 'ఫ్యామిలీ స్టార్'.. ఆ అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది. దీంతో మూడు వారాలకే ఓటీటీ బాట పట్టింది. నేటి(ఏప్రిల్ 26) నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.

మరి థియేటర్లలో పైచేయి సాధించిన 'టిల్లు స్క్వేర్'.. ఓటీటీలో కూడా అదే రిపీట్ చేస్తుందేమో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.