తెలుగు వన్ ప్రేక్షకులకు సుమధుర సమాచారం. అదేమిటంటే...
తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించి అద్భుతమైన ప్రేమికుల జంటలుగా అందరినీ ప్రేమ ముగ్ధులని చేసిన మన తెలుగు సినీ నటులలో ప్రేమికుల జంటల గురించి ప్రేక్షకులందరికీ తెలియజేసి వారిలాగ ద్రుఢనిశ్చయంతో ఉంటే అందరూ ఆనందపరవశులవుతారు అని తెలియజేయడానికే మా ఈ ప్రయత్నం.....
మన తెలుగు సినీ రంగంలో హీరో హీరోయిన్లుగానో... సహజ నటులుగానో నటించి.... నిజ జీవితంలో జంట అయిన వారిలో సూపర్ స్టార్ క్రిష్ణగారు, విజయనిర్మలగారు ఆదర్శప్రాయులు. ఎందుకంటే సినీ రంగంలో ఇద్దరూ ఉన్నత స్ధానంలో ఉండి ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి జంటై ఎందరికో ఆదర్శప్రాయులుగా నిలిచారు. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లే...వీరి కాంబినేషన్ లో వచ్చిన సాక్షి సినిమా వీరిద్దరిలో ప్రేమని సఫలం చేసింది.... వీరిలో స్వచ్ఛమైన ప్రేమ వీరికి...కీర్తిని తెచ్చింది....అభిమానులకు స్పూర్తిని తెచ్చింది.
ఇక తర్వాత రామక్రిష్ణ గీతాంజలి ప్రేమపాత్రులై నిజజీవితంలో జంటైనవారిలో....మొదట చెప్పుకోవాల్సింది.....ఇక రామక్రిష్ణగారు, గీతాంజలి గారు, చలంగారు శారద గారు, శరత్ బాబు రమాప్రభగారు...మరి తర్వాత కాలం వారిలోకి వస్తే...నాగార్జున గారు అమల గారు,రాజశేఖర్ గారు జీవిత గారు, మహేష్ బాబుగారు నమ్రత గారు,
శ్రీకాంత్ గారు ఊహ గారు,
శివబాలాజీ మధుమిత గారు, రాజీవ్ కనకాలగారు సుమగారు,
క్రిష్ణవంశీ రమ్యక్రిష్ణగారు, రాజమౌళి రమారాజమౌళిగారు...
గాయని గీతామాధురి నందుగారు, శ్రావణభార్గవి హేమచంద్రగారు...ఇలా ఎందరో ఆదర్శప్రేమికులు.
వారు చేసిన సినిమాలను...............,
వారు పాడిన పాటలను..................,
వారు ఆడిన మాటలను..................చూసి....
ప్రేమలో పడే వారందరూ కూడా వారిలోని స్వచ్ఛమైన
ప్రేమని చూసి..వారి ప్రేమకు నమస్కారం చేసుకుంటే చాలు....
మన జీవితాలు కూడా అంత ప్రేమకు పొందుతాయని ఆశిస్తూ..
సినిమాల్లోనే కాదు నిజ జీవితాలలో ప్రేమికులజంటగా అందరినీ
అలరిస్తున్న మన తెలుగు సినిమా టీవీ కళాకారులకు,దర్శకులకు అందరికీ మనస్ఫూర్తిగా...
ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.