![]() |
![]() |

2027 సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేస్తున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి తనకి బాగా కలిసొచ్చిన సంక్రాంతిని నమ్ముకున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'మెగా 158' సైతం సంక్రాంతి టార్గెట్ గానే రూపొందుతోంది. అలాగే, నాగార్జున ప్రతిష్టాత్మక 100వ చిత్రం 'కింగ్ 100'ను కూడా పొంగల్ బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇక సంక్రాంతి హీరోగా పేరొందిన శర్వానంద్ కూడా శ్రీను వైట్లతో కలిసి 2027 పొంగల్ వార్ కి రావాలని చూస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ 'సంబరాల ఏటిగట్టు' గురించి ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడిక్ ఫిల్మ్ లో అణిచివేతకు గురవుతున్న ఒక వర్గం తరపున పోరాడే వీరుడి తరహా పాత్రలో తేజ్ సరికొత్తగా కనిపించబోతున్నారు.
Sambarala Yeti Gattu, Sambarala Yeti Gattu, Sankranthi 2027
![]() |
![]() |