Home  »  News  »  RGV సంచలనం: 'టీ సిరీస్'తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్.! 

Updated : Aug 11, 2026

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ T-Series నిర్మాణంలో 'పోలీస్ కంపెనీ' (Police Company) అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. "ఇట్ ఈజ్ మోర్ డేంజరస్ దేన్ డీ కంపెనీ" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా.. ముంబై అండర్‌వరల్డ్ ను వణికించిన, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతోంది.

చట్టాన్ని కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థకే గనక పరిమితి లేని అధికారాలు లభిస్తే ఏమవుతుంది? ఒక ప్రభుత్వ సంస్థగా ఉండాల్సిన వ్యవస్థే, ఒక ప్రైవేట్ కార్పొరేట్ గ్యాంగ్ లాగా 'కంపెనీ'గా మారితే ఎలాంటి విధ్వంసం జరుగుతుంది? సరిగ్గా ఇదే పాయింట్‌ను ఎంచుకుని ఆర్జీవీ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు.

'పోలీస్ కంపెనీ' మూవీ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుపుతూ రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ముంబై అండర్‌వరల్డ్ చరిత్రలో దావూద్ ఇబ్రహీం తన ప్రత్యర్థి గ్యాంగ్‌లను ఒక్కొక్కటిగా మట్టుబెట్టి, తన సామ్రాజ్యాన్ని 'డి కంపెనీ'గా మార్చుకోవడం.. ఆ తర్వాత దుబాయ్ పారిపోవడం అందరికీ తెలిసిందే. కానీ, ఆ తర్వాత ఛోటా రాజన్‌తో వచ్చిన తీవ్ర విభేదాల వల్ల డి కంపెనీ ముక్కలైంది. ఆ సమయంలో ముంబై క్రైమ్ వరల్డ్‌లో ఏర్పడిన ఆ ఖాళీని పూరించడానికి వందలాది చిన్న చిన్న గ్యాంగ్‌లు పుట్టుకొచ్చి నగరాన్ని నరకప్రాయంగా మార్చేశాయి.

ఆ పరిస్థితుల్లో ముంబైని కాపాడేందుకు 1997 నుండి 2004 మధ్యకాలంలో ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రత్యేక 'ఎన్‌కౌంటర్ స్పెషల్ స్క్వాడ్'ను ఏర్పాటు చేసింది. ఈ స్క్వాడ్ ఏకంగా వందలాది మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టింది. ఈ రియల్ లైఫ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్స్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన వ్యక్తి దయా నాయక్. ఆయన నిజ జీవిత సంఘటనలు, ఎన్‌కౌంటర్ల స్ఫూర్తితోనే ఈ 'పోలీస్ కంపెనీ' కథ రూపుదిద్దుకోనుంది.

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ దయా నాయక్ పాత్రలో హర్షవర్ధన్ రాణే నటిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 

https://x.com/RGVzoomin/status/2086810786408898922

 

 

Ram Gopal Varma, Police Company, Daya Nayak, RGV, T Series

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.