![]() |
![]() |

హిట్ ట్రాక్ నే తన రూట్ గా మార్చుకున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఈ నెల 24 న 'చెన్నై లవ్ స్టోరీ' తో వస్తున్న విషయం తెలిసిందే. మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ కావడంతో పాటు మెగా కాంపౌండ్ మనుషులుగా ముద్రపడ్డ సాయి రాజేష్, ఎస్ కె ఎన్ నిర్మాతలుగా వ్యవహరించడంతో పాటు ప్రచార చిత్రాలు కూడా బాగున్నాయి. దీంతో చెన్నైలవ్ స్టోరీ పై మంచి అంచనాలే ఉన్నాయి.
చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ముఖ్య అతిథిగా కానున్నారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడి చేసింది. సినిమా విడుదల తేదీ వేగంగా దగ్గరపడుతుండటంతో, ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలనే ఆలోచనతో నిర్మాతలు ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేశారు. మరి చిరంజీవి హాజరు కావడం చెన్నై లవ్ స్టోరీకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు
చిన్న చిత్రాలకి, యంగ్ డైరెక్టర్లు మరియు కొత్త నటీనటులకి పెద్దపీట వేస్తూ, వారి చిత్ర ఆడియో వేడుకలకు లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరై గ్రాండ్ సక్సెస్ అందించడం చిరంజీవి గారికి ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఆసక్తికరమైన ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి మెగాస్టార్ హాజరుకావడం సినిమాకు ప్రమోషనల్ మైలేజ్‌ను అందించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు 100 శాతం సక్సెస్ సాధించాలంటే ఇలాంటి పెద్ద స్టార్ల సపోర్ట్ ఎంతో కీలకమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read: యష్ మాట తప్పాడు.. టాక్సిక్ రొమాన్స్ వెనుక అసలు నిజాలివే!
మరోవైపు 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి కూడా అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం విశేషం. సెన్సార్ సభ్యులు మూవీలోని కంటెంట్, క్లీన్ లవ్ స్టోరీ, నటీనటుల పనితీరు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ప్రత్యేకంగా అభినందించారని చిత్ర యూనిట్ తెలిపింది. 100 శాతం క్వాలిటీతో పాటు కుటుంబ సమేతంగా చూడదగిన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని నిర్మాతలు ఎంతో నమ్మకంగా వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ అందించిన పక్కా పాజిటివ్ టాక్ ఒకవైపు, టాలీవుడ్ దిగ్గజం మెగాస్టార్ చిరంజీవి అందిస్తున్న ప్రత్యక్ష ఆశీస్సులు మరొకవైపు తోడవడంతో 'చెన్నై లవ్ స్టోరీ' తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే ధీమాతో చిత్రయూనిట్ ఉంది. రవి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
.webp)
chiranjeevi,kiran abbavaram, sri gouri priya
![]() |
![]() |