Home  »  News  »  ప్రముఖ ఫిమేల్ సింగర్‌కు చేదు అనుభవం.. పబ్లిక్ ప్లేస్‌లో ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ.!

Updated : Jul 20, 2026

ప్రముఖ సింగర్ జాస్మిన్ శాండ్లాస్ డెహ్రాడూన్ లైవ్ కన్సర్ట్‌లో ఊహించని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. స్టేజ్ పై తన అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన అనంతరం, అభిమానులతో ముచ్చటించడానికి జాస్మిన్ ప్రయత్నించిన వేళ.. కొందరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ కచేరీ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ముసుగులో కొందరు ఆకతాయిలు ప్రవర్తించిన తీరుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. లైవ్ ఈవెంట్స్ లో మహిళా కళాకారుల భద్రత ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలు మరోసారి తెరపైకి వచ్చాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' లో షేర్ చేసిన ఒక వీడియోలో ఈ దారుణ సంఘటన స్పష్టంగా కనిపించింది. జాస్మిన్ శాండ్లాస్ పాట పాడటం పూర్తి చేసిన వెంటనే ముందు వరుసలో ఉన్న ప్రేక్షకులు ఆమెకు గులాబీ పువ్వులు ఇస్తూ, కరచాలనం చేయడానికి ముందుకు దూసుకొచ్చారు. ఆ సమయంలో ఈ గాయని ఎంతో వినమ్రంగా కిందకు వంగి, అభిమానులు ఇస్తున్న పూలను స్వీకరించడానికి ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు ఆమె చేతిని బలంగా లాగుతూ, ప్రైవేట్ పార్ట్స్ పై అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించినట్లు ఆ వీడియోలో కనిపించింది. దీంతో ఆమె బృందం వెంటనే అప్రమత్తమై, గుంపును వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి గమనించిన జాస్మిన్ కూడా అభిమానులను వెనక్కి జరగాలని చెబుతూ, తాను కూడా వెనక్కి వెళ్ళిపోయింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆకతాయిలపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. కళాకారులు మనల్ని అలరించడానికి వస్తారని, వారి పట్ల కనీస గౌరవం ప్రదర్శించాలని పలువురు కామెంట్లు పెడుతున్నారు. "ఒక కళాకారిణి ప్రేక్షకులతో మాట్లాడటానికి ముందుకు వచ్చినప్పుడు వారికి కనీస గౌరవం ఇవ్వాలి" అని నెటిజన్లు నిలదీస్తున్నారు. కేవలం అభిమానాన్ని చాటుకోవాలనే నెపంతో ఇలాంటి పద్ధతి లేని ప్రవర్తనను సహించేది లేదంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వివాదంపై సింగర్ జాస్మిన్ శాండ్లాస్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

జాస్మిన్ శాండ్లాస్ బాలీవుడ్ తో పాటు పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న సింగర్. సల్మాన్ ఖాన్ 'కిక్' సినిమాలోని 'యార్ నా మిలే', 'ముంజ్యా' చిత్రంలోని 'తరస్' వంటి బ్లాక్‌బస్టర్ సాంగ్స్ తో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే 'ధురంధర్' సినిమాలోని 'శరారత్', 'రంగ్ దే లాల్ (ఓయ్ ఓయ్)' పాటలతో విశేషమైన పాపులారిటీ సంపాదించారు. 

https://x.com/choga_don/status/2078447358996815917

 

Jasmine Sandlas, Dehradun concert, Fan Misbehavior

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.