Home  »  News  »  థియేటర్లలో మళ్ళీ కర్చీఫ్‌లు పంచే రోజులు వస్తాయా!..వస్తే ప్రేక్షకుల పరిస్థితి ఏంటి!

Updated : Jul 20, 2026

 

-తెలుగు సినిమా ఫార్మేట్, సక్సెస్ సీక్రెట్ ఏంటి!
-థియేటర్లలో మళ్ళీ కర్చీఫ్‌లు పంచే రోజులు వస్తాయా!
-ప్రేక్షకుల భావోద్వేగాలని పట్టించుకొనే ముహూర్తం ఆసన్నమైందా!

తెలుగు సినిమా..  షడ్రుచులతో ప్రేక్షకుల సినీ ఆకలిని తీర్చే పసందైన సినిమా.  అటువంటి తెలుగు సినిమాలో ఎన్ని రకాల జోనర్స్ ఉన్నా సెంటిమెంట్ జోనర్ ప్రదానం. . అసలు సెంటిమెంట్ పండించడమే అసలైన సినిమా విజయ సూత్రంగా కూడా  విరాజిల్లింది. సదరు సెంటిమెంట్ సీన్స్ చూసి కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు, ప్రేక్షకురాలు ఉండే వారు కాదు


థియేటర్లలోకి వెళ్లిన వాళ్లంతా కళ్ల నిండా కన్నీళ్లతో, జేబులో కర్చీఫ్ తడుపుకుంటూ బయటకు వస్తేనే ఆ సినిమా వంద రోజులు, రజతోత్సవాలు జరుపుకునేది. భావోద్వేగాల బంధాలతో కూడిన అమ్మానాన్నసెంటిమెంట్, అన్నాచెల్లెళ్ల అనురాగాలు, అన్న దమ్ముల ఆప్యాయతలు, భార్య భర్తల అనుబంధం  బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల వసూళ్ల వర్షాన్ని కురిపించేవి. దీంతో నాటి తరం దర్శకులు మానవ సంబంధాలని గుండెలకి హత్తుకునేలా చూపిస్తూ, ప్రేక్షకుల హృదయాలని కొల్లగొట్టేవి. అయితే మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ చిత్రాల శైలి ,ప్రేక్షకుల అభిరుచుల్లో ఊహించని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు 80 శాతం వరకు కుటుంబ కథా చిత్రాలు, సెంటిమెంట్ డ్రామాలే థియేటర్లలో రాజ్యమేలగా, ఇప్పుడు ఆ స్థానాన్ని భారీ యాక్షన్, గ్రాఫిక్స్, పాన్ ఇండియా చిత్రాలు ఆక్రమించాయి. నేటి 90 శాతం భారీ బడ్జెట్ సినిమాలు యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా లేదా ఊహాజనిత ఫాంటసీ ప్రపంచాల చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ దీని అర్థం ప్రేక్షకులలో ఆనాటి భావోద్వేగాల సెంటిమెంట్ పూర్తిగా కనుమరుగైందని కాదు. నేటి యాక్షన్ సినిమాలలో కూడా అంతర్లీనంగా ఉండే బలమైన ఎమోషనే ఆయా చిత్రాల భారీ విజయాలకు అసలైన ఇంధనంగా మారుతోంది. 


Also read: The odyssey: ది ఒడిస్సీ కలెక్షన్ల సునామీ.. వరల్డ్ వైడ్ గా మూడురోజులకి ఎంతంటే!


ఉదాహరణకు రంగస్థలం చిత్రంలో అన్నదమ్ముల బంధం ప్రేక్షకుల హృదయాలని బరువెక్కించి 216 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించేలా చేసింది. నేటి డిజిటల్ యుగంలో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న 65 శాతం చిన్న బడ్జెట్ హార్ట్-టచింగ్ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. థియేటర్లలో కర్చీఫ్‌లు పంచిన ఆనాటి ప్యూర్ సెంటిమెంట్ డ్రామాలు మునుపటిలా రాకపోయినా, నేటి సరికొత్త రూపంలో ఎమోషన్ సరిహద్దులు దాటుతోంది. సరికొత్త సాంకేతికతతో కూడిన యాక్షన్ డ్రామాల్లోనూ 100 శాతం భావోద్వేగాలను జోడించినప్పుడే ప్రేక్షకులు వాటికి పట్టం గడుతున్నారు. కేవలం ఫైట్లు, గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా మనసును కదిలించే కథలు మళ్లీ మునుపటిలా సరికొత్త కథనంతో థియేటర్లకు భారీగా ప్రేక్షకులను రప్పిస్తాయని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎమోషన్ అనేది ఎప్పటికీ సజీవంగా ఉండే హిట్ ఫార్ములా. ఇప్పుడిప్పుడే పాత కాలంలో జరిగే కథల్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఏ దర్శకుడైనా మళ్ళీ థియేటర్స్ లో కర్చీఫ్ లు పంచె రోజుని తీసుకొస్తాడేమో చూడాలి. 
telugucinema, sentiment movies






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.