![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'పుష్ప 2: ది రూల్' తర్వాత బన్నీ తన తదుపరి చిత్రాలను మరింత పకడ్బందీగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న బన్నీ.. ఆ వెంటనే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో తన 23వ చిత్రాన్ని (AA23) పట్టాలెక్కించనున్నారు.
అయితే, ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సాధారణంగా లోకేష్ కనగరాజ్ సినిమాలంటే డ్రగ్స్, మాఫియా, గ్యాంగ్‌స్టర్ల చుట్టూ తిరిగే చీకటి ప్రపంచపు యాక్షన్ డ్రామాలు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి. కానీ, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్టులో మాత్రం ఒక మైండ్ బ్లోయింగ్ మైథాలజీ ట్విస్ట్ ఉండబోతోందని సమాచారం.
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పురాణాల నేపథ్యానికి, మోడ్రన్ టచ్ యాడ్ చేసిన సినిమాలు విపరీతమైన కలెక్షన్లు రాబడుతున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ చిత్రంలో సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో, భారతీయ మైథాలజీ అంశాలను ముడిపెడుతూ సరికొత్త స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌తో లోకేష్ ఒక సూపర్ హీరో ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపారు. ఇప్పుడు అదే సూపర్ హీరో కాన్సెప్ట్‌కు బలమైన మైథాలజీ ట్విస్ట్ జోడించి, బన్నీ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని ఒక కొత్త అవతారంలో, ఒక పౌరాణిక సూపర్ హీరో తరహా పాత్రలో లోకేష్ ప్రెజెంట్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి.
మైథలాజికల్ టచ్ ఉన్న ప్రధాన ఎపిసోడ్ లో అల్లు అర్జున్ కలిపించే తీరు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం. పురాణాల్లో అత్యంత శక్తిమంతమైన పాత్రల్లో ఒకటిగా గుర్తింపు పొందిన పాత్రలో బన్నీ కనిపిస్తాడని టాక్. మైథలాజికల్ మూవీ చేయాలని అల్లు అర్జున్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. త్రివిక్రమ్ తో చేయాలనుకున్న ‘గాడ్ ఆఫ్ వార్’ అనే భారీ పౌరాణిక చిత్రం మిస్ అయినప్పటికీ.. ఇప్పుడు లోకేష్ ప్రాజెక్ట్ రూపంలో ఆ కోరిక తీరబోతుందని తెలుస్తోంది. అయితే ఇది పూర్తి స్థాయి పౌరాణిక చిత్రం, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే బన్నీ పౌరాణిక పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
Allu Arjun, Lokesh Kanagaraj, AA23
![]() |
![]() |