Home  »  News  »  అఖిల్ 'లెనిన్' కోసం రంగంలోకి ఎన్టీఆర్.. బిగ్ సర్‌ప్రైజ్ లోడింగ్.!

Updated : Jul 3, 2026

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా 'లెనిన్' (Lenin) విడుదలకు సిద్ధమవుతోంది. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు అక్కినేని అభిమానుల్లోనూ, ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. జూలై 10న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఒక సంచలన అప్డేట్ బయటకు వచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం కాబోతున్నారు. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ 'లెనిన్' మూవీ ప్రమోషన్స్ కోసం తారక్ ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ తో అఖిల్ ముచ్చటించబోయే ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన షూట్ త్వరలోనే ప్రారంభం కానుందని టాక్ నడుస్తోంది.

సాధారణంగానే నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. గతంలో కూడా అఖిల్ నటించిన సినిమాల ఈవెంట్స్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి తన మద్దతును ప్రకటించారు. ఇప్పుడు 'లెనిన్' సినిమా కోసం తారక్ స్వయంగా రంగంలోకి దిగి ఇంటర్వ్యూ చేయనుండటం సినిమా బిజినెస్ కు, ప్రమోషన్స్ కు ఒక భారీ మైలేజ్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

'ఏజెంట్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత సుమారు మూడేళ్ల సుదీర్ఘ గ్యాప్ తీసుకుని అఖిల్ చేస్తున్న సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్ అఖిల్ కెరీర్ కి ఎంతో కీలకంగా మారింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లా పల్లెటూరి వాతావరణంలో సాగే ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ అండ్ యాక్షన్ లవ్ స్టోరీగా 'లెనిన్' రూపొందింది. చిత్తూరు యాసలో సాగే డైలాగులు, ఊహించని మలుపులతో కూడిన స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. 

ఈ సినిమాలో అఖిల్ సరసన క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ తోడైతే, బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ పరంగా 'లెనిన్' ఒక రేంజ్ లో దూసుకుపోవడం ఖాయం. త్వరలోనే ఈ క్రేజీ ఇంటర్వ్యూ ప్రసారం కానున్న నేపథ్యంలో ఫ్యాన్స్ 'ఎన్టీఆర్ విత్ అఖిల్ అక్కినేని లోడింగ్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

 

 

Jr NTR, Akhil Akkineni, Lenin Movie, TeluguOne

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.