Home  »  News  »  సత్యదేవ్ 'రావు బహదూర్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Updated : Jul 3, 2026

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్' (Rao Bahadur) థియేటర్లలోకి వచ్చేసింది. నేడు(జూలై 3) విడుదలైన ఈ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్, ఈ చిత్రంలోనూ ఒక సరికొత్త రోల్‌లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఒక భారీ ఓటీటీ డీల్‌ను క్లోజ్ చేసుకుని ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. 

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంటున్న ఈ విలక్షణ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై ఎప్పుడు సందడి చేయనుందనే ఆసక్తి ఇటు సినిమా లవర్స్ లోనూ, అటు ఓటీటీ ఆడియన్స్ లోనూ విపరీతంగా పెరిగిపోయింది.

సాధారణంగా చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాలకు, క్రేజీ ప్రాజెక్ట్‌లకు అనుసరించే 4 నుంచి 6 వారాల విండో రూల్‌ను ఈ సినిమాకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ థియేట్రికల్ అగ్రిమెంట్ ప్రకారం, జూలై 3న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం సుమారు ఒక నెల రోజుల పాటు బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఆ లెక్కన చూసుకుంటే ఆగస్ట్ మూడో వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 

Also Read: 'రావు బహదూర్' మూవీ రివ్యూ

ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు.

'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి క్లాసిక్ సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. కథ విషయానికి వస్తే, రామప్ప రావు బహదూర్ అనే ఒక రాజవంశపు వారసుడి చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. అనుమానం పెనుభూతం అన్నట్టుగా.. తీవ్రమైన అనారోగ్యంతో మంచానపడ్డ రామప్ప, తన కుమారుడి పుట్టుకపై అనుమాన పడుతూ నిజానిజాలు తెలుసుకోవాలి అనుకుంటాడు. సత్యదేవ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక మరియు మాస్టర్ కిరణ్ వంటి నటీనటులు కీలక పాత్రలలో ఒదిగిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

 

 

Rao Bahadur, Satyadev, Venkatesh Maha, Mahesh Babu, Netflix

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.