Home  »  News  »  'భోళా బాలయ్య' సాంగ్ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను ఎమోషనల్ స్పీచ్!

Updated : Jun 8, 2026

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) బర్త్‌డే వస్తోందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఆ సందడే వేరుగా ఉంటుంది. ఈ ఏడాది బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం జగన్ సమర్పణలో రూపొందిన 'భోళా బాలయ్య' (BHOLA BALAYYA) సిగ్నేచర్ సాంగ్‌ను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. అసలు ఇది ఒక ప్రైవేట్ సాంగ్ లాంచ్ లా కాకుండా, ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను తలపించేలా అభిమానులు అద్భుతంగా అరేంజ్ చేశారని కొనియాడారు. బాలయ్య బాబు గురించి తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని, ఆయన ఏంటనేది తన సినిమాల ద్వారా ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద నిరూపించానని చెప్పారు. ఈ సాంగ్‌లో మ్యూజిక్, లిరిక్స్, విజువల్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయని టీంను అభినందించారు.

ఇక బాలయ్య వయసుపై బోయపాటి చేసిన కామెంట్స్ నవ్వులు పూయించాయి. "గత ఏడాది బాలయ్య బాబు బర్త్‌డే సమయంలో మనం షూటింగ్‌లో ఉన్నాం. అప్పుడు ఆయన వయసు 65 అంటే 56 అని, అంతకుముందు 61 అంటే 16 అని నెంబర్స్ రివర్స్ చేసి మాట్లాడేవాళ్లం. కానీ ఈసారి ఆయన 66వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ 66 నెంబర్‌ను ఎటు తిప్పినా ఒకేలా ఉంటుంది.. కాబట్టి ఈసారి తిప్పడానికి కుదరదు" అంటూ నవ్వుతూనే బాలయ్య ఎనర్జీని ఆకాశానికెత్తేశారు.

మనిషిలోని మానవత్వానికి, ఎనర్జీకి వయసుతో అస్సలు సంబంధం లేదని బోయపాటి స్పష్టం చేశారు. ఆ రెండు క్వాలిటీస్ బాలయ్య బాబులో పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఆయన ఎప్పుడూ ఇంతే ఎనర్జిటిక్‌గా ఉంటారని అన్నారు. కేలండర్‌లో లేని ఒకే ఒక్క పండగ.. బాలయ్య బాబు పుట్టినరోజు మాత్రమేనని, అది కేవలం నందమూరి అభిమానుల గుండెల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, బాలయ్య అభిమానులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను బోయపాటి ప్రత్యేకంగా అభినందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, క్యాన్సర్ హాస్పిటల్‌లో అన్నదానాలు చేస్తూ తమ హీరోపై ఉన్న నమ్మకాన్ని, ప్రేమని చాటుకుంటున్నారన్నారు. కేవలం హీరోని ఆరాధించడమే కాకుండా, ఆయనలోని సేవా గుణాన్ని స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు బాధ్యతగా ముందుకు సాగడం నిజంగా గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు.

ఈ 'భోళా బాలయ్య' సిగ్నేచర్ సాంగ్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. బాలయ్య బాబు చిన్నప్పటి నుంచి నేటి వరకు ఉన్న అరుదైన పోస్టర్స్, విజువల్స్ సాంగ్‌లో చూపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.