Home  »  News  »  Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్' లో అసలైన లుక్ వేరే ఉందా? మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్!

Updated : Jun 7, 2026

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్' (Dragon). ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో అని నందమూరి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. 

ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'డ్రాగన్' ఫస్ట్ గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు అందరికీ పూర్తి స్పష్టత వచ్చేసింది. డ్రగ్స్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా సాగే కథతో ఈ క్రేజీ మూవీ రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

అయితే మొదటి గ్లిమ్స్‌లో కనిపించిన ఎన్టీఆర్ లుక్ పై అభిమానుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సినిమాలో తారక్ అసలైన లుక్ ఇదేనా అంటూ రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 'డ్రాగన్' సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో ఒక అత్యంత క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే, మనం గ్లిమ్స్‌లో చూసిన ఎన్టీఆర్ లుక్ కేవలం "లుగర్ వెర్షన్" లుక్ మాత్రమేనట. అసలైన మాస్ ‘డ్రాగన్’ లుక్‌ను రివీల్ చేయడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు.

ఈ అసలైన వైల్డ్ అండ్ పవర్ఫుల్ సెకండ్ లుక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ విస్ఫోటనం లాంటి అప్‌డేట్ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఈ డ్రాగన్ అసలైన రూపాన్ని, సెకండ్ లుక్‌ను అధికారికంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అంటే నందమూరి అభిమానులు ఆ అసలైన విజువల్ ట్రీట్ కోసం మరో 6 నెలల పాటు ఓపిక పట్టాల్సిందే అన్నమాట. కానీ ఒక్కసారి డిసెంబర్‌లో ఈ సెకండ్ లుక్ కనుక బయటకు వస్తే మాత్రం, సినిమాపై ఉండే హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

మరోవైపు ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ మేకింగ్ విషయంలో చాలా షార్ప్ గా అడుగులు వేస్తున్నారు. కేజీఎఫ్ తరహాలోనే ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేసిన నీల్, ఈసారి పార్ట్-1 మరియు పార్ట్-2 పనులను సమాంతరంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. దీనివల్ల తక్కువ గ్యాప్‌లోనే రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, జూన్ 11, 2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.