Home  »  News  »  vijay deverakonda: గండికోటలో విజయ్ దేవరకొండ.. హై ఓల్టేజ్ యాక్షన్ రచ్చ

Updated : Jun 4, 2026

 


విజయ్ దేవరకొండ( vijay deverakonda),రష్మిక(Rashmika Mandanna)వివాహం తర్వాత జంటగా కనిపించబోతున్న చిత్రం 'రణబాలి'.  పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా ప్రస్తుతం  ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చారిత్రాత్మక పర్యాటక కేంద్రం గండికోటలో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి విజయ్ దేవరకొండకి సంబంధించిన కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ వీడియోలు, పిక్స్  సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో మరియు అభిమానుల్లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి.

 లీకైన విజువల్స్ లో విజయ్ దేవరకొండ గుర్రపు స్వారీ చేస్తూ శత్రువులను చీల్చిచెండాడుతున్నాడు. దీంతో  విజయ్ ని  చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు  రాయలసీమ చారిత్రక నేపథ్యంలో 19వ శతాబ్దం నాటి కథతో తెరకెక్కుతున్న రణబాలి' లో  విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని రీతిలో ఒక శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. కత్తి పట్టి గుర్రంపై రౌడీ స్టార్ చేస్తున్న విన్యాసాలు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ గండికోటలో మొత్తం 6 రోజుల పాటు బస చేయనుంది. 100 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ని ప్లాన్ చేశారు. ఈ ఒక్క గుర్రపు స్వారీ యాక్షన్ సీక్వెన్స్ కోసమే నిర్మాతలు దాదాపు రూ. 5 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు టాక్ నడుస్తోంది. సినిమాలో దాదాపు 15 నిమిషాల పాటు సాగే ఈ విజువల్ వండర్ యాక్షన్ బ్లాక్ ప్రేక్షకులకి మంచి  అనుభూతిని ఇస్తుందని తెలుస్తోంది.

Also read: కట్టప్ప కూతురు దివ్య సత్యరాజ్ సీక్రెట్ పెళ్లి!.. అసలు ట్విస్ట్ వింటే షాక్ అవుతారు

 ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ 100% పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేయగా ఇప్పుడు గండికోట లీక్స్ సినిమాపై హైప్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంక్రుతయన్ దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధులు.

 

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.