Home  »  News  »  Raju weds rambai: రాజు వెడ్స్ రాంబాయి మేకర్స్ సెకండ్ ప్రాజెక్ట్.. ఈ సారి ఈ యదార్ధ గాథ

Updated : Jun 2, 2026

 

'రాజు వెడ్స్ రాంబాయి'(Raju weds Rambai).. ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఖమ్మం, వరంగల్ సరిహద్దుల్లో జరిగిన ఒక యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కి చిన్న చిత్రం, పెద్ద చిత్రం అనే తారతమ్యాన్ని చెరిపివేసింది. సరికొత్త కథ, కథనాల్ని కూడా సెల్యులాయిడ్ కి పరిచయం చేసిందని చెప్పవచ్చు. సాయిలు దర్శకత్వంలో మరో  దర్శకుడు విరాటపర్వం ఫేమ్ 'వేణు ఊడుగుల' నిర్మించాడు.  గద్దర్ అవార్డ్స్ 2025 అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

 నిర్మాతగా తొలి అడుగులోనే ఇంతటి ఘనవిజయం సాధించిన వేణు ఊడుగుల(Venu Udugula)ఇప్పుడు డోలాముఖి సబ్‌ఆల్టర్న్ ఫిల్మ్స్, మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్లపై తన సరికొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించారు. ఈ నూతన చిత్ర ప్రకటన కేవలం ఒక సినిమా అనౌన్స్‌మెంట్‌గా మాత్రమే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది వర్ధమాన కళాకారులకి ఒక బంగారు అవకాశంగా మారింది. కేవలం 150 నిమిషాల వెండితెర కథ కోసం కాకుండా, సమాజంలోని మూలాల్లో ఉన్న సహజత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రాజెక్ట్‌ని వేణు ఊడుగుల ప్లాన్ చేస్తున్నారు. ఈ సరికొత్త సామాజిక సందేశాత్మక చిత్రంలో నటించేందుకు పక్కా తెలంగాణ యాస, భాష వచ్చిన నటీనటులు కావాలంటూ చిత్ర యూనిట్ ఒక వినూత్నమైన కాస్టింగ్ కాల్‌ ని  వదిలింది. పల్లెటూరి వాతావరణంలో పెరిగి, తెలంగాణ జీవన విధానంపై పూర్తి పట్టున్న ప్రతిభావంతులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయనున్నారు. గత చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతు జొన్నలగడ్డ, అఖిల్ రాజ్, తేజస్విని వంటి స్థానిక నటులకు పెద్ద పీట వేసినట్లే, ఈసారి కూడా సరికొత్త టాలెంట్‌ని  వెలికితీయడానికి 100 శాతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.

Also read: Anushka sharma: వైరల్ గా మారిన వాచ్... ధర తెలిస్తే షాక్ అవుతారు

 ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.  భారతీయ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు, విభేదాలు కొత్తవి కావు. కానీ ఒక ఇల్లు చీలిపోతే కేవలం ఆ కుటుంబమే ఓడిపోతుందా? లేక ఆ ఊరంతా నష్టపోతుందా? అనే  ప్రశ్న చుట్టూ ఈ కథ తిరుగుతుంది. “అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లా ఉండేవారనే రోజులు పోయాయి… ఇప్పుడు రక్తం పంచుకున్నవాళ్లే గొడ్డళ్లు పట్టుకునే మహాభారతం నడుస్తోంది. మా ఊరు జమ్మికుంట మట్టిసాక్షిగా.. ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ, కేవలం వాళ్ల ఇల్లనే కాదు… మా ఊరి రాతనే మార్చేసింది. అసలు ఆ రోజు ఎవరు గెలిచారో తెలియదు కానీ… ఊరు మాత్రం ఓడిపోయింది. ఇది ఏ ఇంట్లోనూ జరగకూడని కథ. పిల్లలు, పెద్దలు, తాతలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు… అందరూ బయల్దేరండి, ఆ అన్నదమ్ముల పంచాయితీ ఏంటో సూద్దాం.” అని మేకర్స్ ఒక ఎమోషనల్ నోట్ వదిలారు. మధుకర్ రెడ్డి కొమిరెడ్డి కథ-దర్శకత్వంలో, DSF ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా ఈ చిత్రం వస్తుంది. ఈ సంవత్సరమే సెల్యులాయిడ్ పై అడుగుపెట్టనున్నట్టుగా తెలుస్తుంది.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.