Home  »  News  »  Peddi: వెన్నుపోటు పొడవలేదు, వెన్నంటే ఉన్నారు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ స్పీచ్ వైరల్   

Updated : Jun 1, 2026

 


 విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు విజయవాడ నగరమంతా పెద్ది నామజపంతో ఊగిపోయింది. మేకర్స్ కూడా  పెద్ది(Peddi)ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో గ్రాండ్ గా జరగడంతో జోష్ లో ఉన్నారు. ఇక  తమ అభిమాన హీరో చరణ్ ని లైవ్ లో చూసిన ఆనందం అయితే ఫ్యాన్స్ లో అంతా ఇంతా కాదు.


ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ మాట్లాడుతు 'రాసి పెట్టుకోండి ఫ్యూచర్ లో  ఇండియాలో టాప్ నలుగురు డైరెక్టర్స్ లో బుచ్చిబాబు ఒకడిగా ఉంటాడు. ప్రొడ్యూసర్ సతీష్ గారు ప్రతి నిమిషం మా వెన్నంటే ఉన్నారు. ఈ మాట చెప్పేటప్పుడు చరణ్ పొరపాటున వెన్నుపోటు పొడిచారు అని అన్నాడు. ఆ తర్వాత వెంటనే తన తప్పు గ్రహించి వెన్నంటి ఉన్నారని చెప్పుకొచ్చాడు.

 అనంతరం చరణ్ మాట్లాడుతు 'ఒక ఆటగాడు ఓడిపోతే ఆటగాడు కాదు దేశం మొత్తం ఓడిపోయినట్ట్టే . పెద్ది ఆత్మగౌరవాన్ని దుర్గమ్మ తల్లి నిలబెడుతుందనే నమ్మకం ఉంది.  నా లక్కీయాస్ట్ సిటీ విజయవాడ. నాన్న గారి  ఖైదీ నెంబర్ 150 , ఇంద్ర ఫంక్షన్స్ ఇక్కడే జరిగాయి. అందుకే పెద్దిని కూడా ఇక్కడే జరుపుతున్నాం. ఈవెంట్ కి వచ్చిన అక్కయ్యలకి, అన్నయ్యలకి, చెల్లెళ్లకి, తమ్ముళ్ళకి  హాయ్. పెద్ది నా హృదయానికి దగ్గరైన కథ. నా లైఫ్ లాంగ్ నా సినీ లైబ్రరీలో ఉంటుంది. పెద్ది నన్ను మంచి దారిలోకి మార్చింది. నాన్న గారు చెప్పినట్టు పెద్ది లాంటి చిత్రం పది సంవత్సరాలకి ఒకటి వస్తుంది.

Also read: Peddi: మీ కోసం రక్తం అయినా చిందిస్తాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ ఎమోషనల్ స్పీచ్ 

పెద్ది పడి లేచి మళ్ళీ నిలబడే యువకుడి  కథ. ప్రతి రోజు షూటింగ్ వెళ్తున్నప్పుడు  మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్' లా  పాజిటివ్ గా  అనిపించింది. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. సినిమాని ఎంతో కష్టపడి చేసేది మీ కోసమే. ఇంట్లో నాన్న, బాబాయ్ ని చూస్తూనే ఉన్నాను. మీ కోసం చేతులు విరగొట్టుకోవడం కాదు. రక్తం అయినా చిందిస్తాను. నాకు తెలిసిందల్లా సినిమా. నేను చనిపోయే వరకు మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాను . శ్రీదేవి గారిని మించి జాన్వీ కపూర్ మంచి పేరు తెచ్చుకుంటుంది. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి.  మీ ఇంట్లో వాళ్ళందర్నీ అడిగానని చెప్పండని మాట్లాడిన చరణ్  అనంతరం గద, బాట్ ని ధరించి ఫ్యాన్స్ లో జోష్ ని మరింతగా నింపాడు.


   


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.