Home  »  News  »  Peddi: 'పెద్ది' మెయిన్ స్టోరీ లైన్ లీక్ చేసిన జగపతి బాబు.. అసలు కథ ఇదేనా!

Updated : May 30, 2026

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ శరవేగంగా దూసుకుపోతుండగా, సీనియర్ యాక్టర్ జగపతి బాబు సినిమా కోర్ ప్లాట్‌కు సంబంధించిన ఒక సంచలనమైన విషయాన్ని లీక్ చేశారు.

తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన జగ్గు భాయ్, 'పెద్ది' సినిమా అసలు కథ దేని చుట్టూ తిరగబోతుంది, అలాగే రామ్ చరణ్ మరియు తన పాత్రల మధ్య ఎలాంటి బంధం ఉండబోతుందనే క్రేజీ అప్‌డేట్‌ను బయటపెట్టారు.

ఈ చిత్రంలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్ డిజైన్ చేసిన ఈ రా అండ్ ఇంటెన్సివ్ గెటప్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

ఈ పాత్ర గురించి జగపతి బాబు వివరిస్తూ.. “సినిమాలో రామ్ చరణ్ 'పెద్ది' అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. వయసు రీత్యా అతనికంటే చాలా పెద్దవాడైన 'అప్పలసూరి' పాత్రలో నేను కనిపిస్తాను. వయసులో ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ, సినిమాలో మా ఇద్దరి క్యారెక్టర్ల మధ్య బాండింగ్ చాలా క్లోజ్ గా ఉంటుంది. ఏకంగా ఒకరినొకరు 'అరేయ్.. ఒరేయ్' అని పిలుచుకునే రేంజ్‌లో ఈ రిలేషన్ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సాగే బాండింగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, 'పెద్ది' సినిమా నడిచే మెయిన్ థీమ్ ఏంటనే అసలు రహస్యాన్ని కూడా జగపతి బాబు వెల్లడించారు. “ఈ రోజుల్లో సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య 'గుర్తింపు'. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఏదో ఒక రూపంలో నిత్య జీవితంలో కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఒక జెన్యూన్ ఐడెంటిటీ ప్రాబ్లం మరియు సమాజంలో ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం పడే తపన చుట్టూనే బుచ్చిబాబు సన ఈ కథ మొత్తాన్ని అద్భుతంగా అల్లారు.” అంటూ స్టోరీ ఎలా ఉండబోతుందో చెప్పారు జగపతి బాబు.

గతంలో రామ్ చరణ్ సరసన 'రంగస్థలం'లో ప్రెసిడెంట్ పాత్రలో విలనిజం పండించిన జగపతి బాబు, ఈ రూరల్ డ్రామాలో అంతకుమించి అప్పలసూరిగా విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

జగ్గు భాయ్ లీక్ చేసిన ఈ ఐడెంటిటీ క్రైసిస్ పాయింట్, రామ్ చరణ్ తో ఆయనకున్న 'అరేయ్ ఒరేయ్' రిలేషన్ షిప్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఏ రేంజ్ ఎమోషన్ పండించబోతున్నాయో అని మెగా అభిమానులు జూన్ 4 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.