Home  »  News  »  టాలీవుడ్‌లో ఇది ఒక ఐకానిక్‌గా మిగిలిపోతుంది.. 'వదలనే' సాంగ్ లాంచ్‌లో కిరణ్ అబ్బవరం!

Updated : May 26, 2026

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ" (Chennai Love Story). సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సినిమా సెకండ్ సింగిల్ 'వదలనే..' (Vadhalane) పాటను సోమవారం హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్స్ మాధవపెద్ది సురేష్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, హరి గౌర, మార్క్ కె రాబిన్, సింజిత్ యెర్రమల్లి, చేతన్ భరద్వాజ్, స్వీకర్ అగస్తీ, సురేష్ బొబ్బిలి, వివేక్ సాగర్, శ్రీచరణ్ పాకాల, తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. "బేబి సినిమా చూసిన తర్వాత సాయి రాజేశ్ ఫ్యాన్స్ లో నేనూ ఒకరిగా మారిపోయాను. ఈ సినిమా సాంగ్స్, విజువల్స్ చూస్తుంటే బేబి సినిమా స్టాండర్డ్ లోనే "చెన్నై లవ్ స్టోరీ" ఉంటుందని, ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని అర్థమవుతోంది. నా ఫ్రెండ్ మణిశర్మ చేసిన 'వదలనే..' పాట హాంటింగ్ గా ఉంది. ఈ పాటను మ్యూజిక్ లవర్స్, మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ వదలనే అనాలి. అంత పెద్ద విజయం సాధించాలి. ఈ చిత్రంలో ఏడు పాటలు ఉంటాయి. ఒక లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే ఇంక చెప్పక్కర్లేదు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే లవ్ స్టోరీకి ప్రాణమే సంగీతం. మ్యూజిక్ ఈ సినిమాకు చక్కగా కుదిరింది. హీరో హీరోయన్స్ కూడా ఫ్రెష్ పెయిర్ గా కనిపిస్తున్నారు. చూడటానికి బాగున్నారు. హీరో హీరోయిన్స్ ఎక్స్ ప్రెషన్స్, విజువల్స్ బాగున్నాయి. ఈ వేదిక మీద ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మిత్రులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా." అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "చెన్నై లవ్ స్టోరీ గురించి లాస్ట్ టైమ్ చెప్పాను. నేను కూడా మీలాగే సినిమా కోసం వేచి చూస్తున్నా. త్వరగా సినిమా రిలీజ్ చేయమని మా ప్రొడ్యూసర్స్ ను అడుగుతున్నా. ఈ సినిమా ఎలాంటి విజయం అందించబోతుందో మాకు తెలుసు. వదలనే పాట గురించి చెప్పాలంటే..ఈ పాట పిక్చరైజేషన్ పాండిచ్చేరిలో చేశాం. ఒక బ్యూటిఫుల్ టెంపుల్ దగ్గర డైరెక్టర్ రవి నాకు, గౌరికి సీన్ చెప్పారు. ఆ సీన్ చెబుతున్నప్పుడు నాకు, రవికి, గౌరికి కళ్లు చెమర్చాయి. అంత ఎమోషనల్ అయ్యాం. ఈ పాటలో ఫస్ట్ వచ్చిన ఆ సీన్ విజువల్ తెలుగు సినిమాల్లో ఒక ఐకానిక్ సీన్ గా మిగిలిపోతుంది. మణిగారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. గురుతుందా, వదలనే, రాబోయో సాంగ్..ఇలా అన్ని సాంగ్స్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. ఇప్పుడు లిరికల్ గా మీకు ఎంత నచ్చుతుందో సినిమా చూసి బయటకు వచ్చాక అంతకంటే ఎక్కువగా వదలనే సాంగ్ నచ్చుతుంది. చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసి బయటకు వచ్చాక ఈ పాట హాంట్ చేస్తూనే ఉంటుంది. వదలనే సాంగ్ విన్నప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్ కలుగుతోంది. ఈ పాటను మీరంతా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా." అన్నారు. 

హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ.. "నేను సింగర్ కావాలని ప్రయత్నించాను. ఏ కాంపిటేషన్ కు వెళ్లినా మణిశర్మ గారి పాటలు పాడాను. అలా ఆయన నన్ను కొత్త సింగర్ గా ఇన్స్ పైర్ చేశారు. ఇప్పుడు ఆయన మ్యూజిక్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించడం గౌరవంగా భావిస్తున్నా. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న చిత్రంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటించే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్ రాజేశ్ గారు, ఎస్ కేఎన్ గారికి, హీరో కిరణ్ గారికి, డైరెక్టర్ రవి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మ్యూజిక్ లవర్ గా ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో వేదిక షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. వదలనే పాటను మీకు హ్యాపీగా అందిస్తున్నాం. ఈ పాట ఇప్పట్లో మిమ్మల్ని వదలదు. మా చెన్నై లవ్ స్టోరీ చిత్రాన్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి." అన్నారు.

డైరెక్టర్ రవి నంబూరి మాట్లాడుతూ.. "ఈ వేదిక మీద మాట్లాడాలంటే భయమేస్తుంది. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ను చూస్తుంటే ఈ వేదిక ఒక మ్యూజిక్ యాప్ లా అనిపిస్తోంది. వదలనే పాట నా కెరీర్ లో బెస్ట్ సాంగ్ గా మిగిలిపోతుంది. మణిగారికి, అనంత శ్రీరామ్ గారికి థ్యాంక్స్. నా ప్రొడ్యూసర్స్ రాజేశ్, ఎస్ కే ఎన్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా." అన్నారు.

ప్రొడ్యూసర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ.. "మణిశర్మ గారి కోసం ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మా ఈవెంట్ కు వచ్చారు. వీళ్లలో ప్రతి ఒక్కరితో నేను వర్క్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. మణిశర్మ గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనను కలిసినప్పుడు ఈ సినిమాలో అన్ని పాటలు మెలొడీస్ కావాలని చెప్పాను. ఇటీవల కాలంలో ఆయన ఒక సినిమా అన్ని మెలొడీ సాంగ్స్ ఇవ్వలేదు. ఆయన నుంచి మెలొడీ సాంగ్స్ మిస్ అవుతున్నాం. అందుకే చెన్నై లవ్ స్టోరీ సినిమాలోని ఏడు పాటలు మెలొడీస్ కావాలని అడిగాను. అలా మేము ఆయనను రిక్వెస్ట్ చేసి చేయించుకున్న చిత్రమిది. వదలనే పాట ఇంత బాగుందంటే క్రెడిట్ మణిగారితో పాటు అనంత శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ రవికి ఇవ్వాలి. హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ లో ఈ సాంగ్ వస్తుంది. ఆ సందర్భానికి ముందు లిరిక్ రాసి, రవికి వినిపిస్తే, రవి నంబూరి డిఫరెంట్ అప్రోచ్ తో పాట రూపొందించారు. ఇలాంటి పాట తీసుకోవడానికి డైరెక్టర్ కు గట్స్ ఉండాలి. మణిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కొన్ని పాటలు ఇన్ స్టంట్ గా నచ్చుతాయి. మరికొన్ని నెమ్మదిగా ఆదరణ పొందుతాయి. అలాంటి పాటలు చిరకాలం మనసులో నిలిచిపోతాయి. వదలనే అలాంటి సాంగ్. ఇది మణిసార్ క్లాసిక్స్ లో ఒక టాప్ సాంగ్ లా ఉంటుంది. మూవీ రిలీజ్ అయ్యాక ఈ పాట మిమ్మల్ని వదలదు. ఇంటర్వెల్ ముందు, తర్వాత, సినిమా అంతా ఈ పాట ట్రావెల్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యాక ఒక గొప్ప పాటగా నిలిచిపోతుంది. కిరణ్ గారు ఈ పాటలో అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. ఈ లిరికల్ సాంగ్ లో ఆయన పర్ ఫార్మెన్స్ రివీల్ చేయొద్దని, అది బిగ్ స్క్రీన్ మీదే సినిమాలో ఆడియెన్స్ చూడాలని జాగ్రత్తగా ఎడిట్ చేశాం. ఈ మూవీ యాక్సెప్ట్ చేసినందుకు, ఈ పాత్రకు ప్రాణం పోసినందుకు కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. శ్రీ గౌరి ప్రియ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టింది. ఆమె క్యారెక్టర్ చుట్టూనే ఈ మూవీ రన్ అవుతుంటుంది. ఆమె తెలుగుమ్మాయి. మంచి సింగర్ కూడా. ఈ సినిమా అందరి మనసులు గెలవాలని కోరుకుంటున్నా." అన్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.