Home  »  News  »  ‘పురుష:’ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ బత్తుల

Updated : May 24, 2026

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’  ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం మంచి మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు చిత్రయూనిట్ శనివారం నాడు థాంక్స్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. 

పవన్ కళ్యాణ్ బత్తుల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. నేను సత్యానంద్ మాస్టర్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పలేదు. ఒక వేళ నా నేను బాగా నటించకపోతే మీ పేరుకి ఎఫెక్ట్ అవుతుందని అనుకున్నాను. ఈ రోజు నా నటనకు మంచి పేరు వస్తోంది. అందుకే ఈ రోజు నేను సత్యానంద్ మాస్టర్ గారి శిష్యుడిని అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇదంతా వీరు గారి వల్లే సాధ్యమైంది. ప్రీమియర్ల నుంచీ మా సినిమాకి మంచి టాక్ వచ్చింది. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. సప్తగిరి అన్న, కసిరెడ్డి అన్న నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచారు. రాయంచ, విషిక, హాసిని ఇలా అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు. సతీష్ గారు నన్ను చాలా డిఫరెంట్‌గా చూపించారు. శ్రవణ్ గారు మంచి పాటలు, బీజీఎం ఇచ్చారు. చిత్రంలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కి థాంక్స్. మూవీని చూసి నాలోని ప్లస్, మైనస్‌లు చెప్పండి. మైనస్‌లు చెబితే వాటిని నేను అధిగమించేందుకు ప్రయత్నిస్తాను. మా సినిమాని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఇంకా చూడనివారు మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని, మా కష్టాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత బత్తుల కోటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘పురుష:’ సినిమాను ఇంతటి స్థాయికి తీసుకు వెళ్లిన మీడియాకి థాంక్స్. ముగ్గురు హీరోయిన్లు చక్కగా నటించారు. వీరు ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. కెమెరామెన్ సతీష్ గారు మంచి వ్యక్తి. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. పవన్ కళ్యాణ్ బత్తులని హీరోగా పెట్టి సినిమా తీస్తామని నా కంటే కోటీశ్వరులు ఫోన్ చేసి చెప్పారు. నేనే ఇంకో రెండు చిత్రాలు చేస్తానని వారికి చెప్పాను. ఎక్కడా కొత్త అబ్బాయిలా అనిపించలేదు. మా అబ్బాయి యాక్టింగ్ నాకు నచ్చింది.

దర్శకుడు వీరు వులవల మాట్లాడుతూ .. ‘‘పురుష:’ చిత్రాన్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్. బత్తుల కోటేశ్వరరావు గారి వల్లే ఈ ప్రాజెక్ట్ మొదలై ఇక్కడి వరకు వచ్చింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. సోదరి సరస్వతి గారి సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. రాయంచ, విషిక, హాసిని ఇలా హీరోయిన్లంతా అద్భుతంగా నటించారు. సప్తగిరి గారు, కసిరెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ మూవీకి ఓ పిల్లర్‌లా నిలబడ్డాడు. రెండు నెలలు వర్క్ షాప్ చేశాడు. ప్రతీ ఒక్క సీన్‌ను ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేశాడు. అందుకే ఆడియెన్స్‌కి ఎక్కడా కూడా కొత్త కుర్రాడిలా అనిపించడు. ఈ జర్నీలో పవన్ కళ్యాణ్ నాకెంతో సపోర్ట్ చేశాడు. సతీష్ గారు, రవి గారు అందరూ నాకు అండగా నిలిచారు. మా ఆర్టిస్టులు, మా టీం కలిసి ఎంతో కష్టపడి ఈ మూవీని తీశాం. మా మూవీని ఆడియెన్స్ వరకు రీచ్ చేసిన మీడియాకి థాంక్స్. సినిమాని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

కసిరెడ్డి రాజ్ కుమార్ మాట్లాడుతూ .. ‘పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సినిమాలా జనాలకు అనిపించకూడదు.. అంత బాగా నటించాలని పవన్ కళ్యాణ్‌కి చెప్పాను. ఇప్పుడు ఆడియెన్స్ నుంచి అదే రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. నాకు ఆనందంగా ఉంది. రాయంచ అద్భుతంగా నటించారు. హాసిని, విషిక అందరూ చక్కగా నటించారు. సప్తగిరి అన్నతో నటించడం ఆనందంగా ఉంది. నాలుగేళ్ల నుంచి వీరు గారితో పరిచయం ఉంది. నన్ను గుర్తు పెట్టుకుని పాత్రను ఇచ్చిన వీరు గారికి థాంక్స్. కెమెరామెన్ సతీష్ గారు బడ్జెట్‌ను కంట్రోల్‌లో పెడతారు. ఆర్ట్ డైరెక్టర్ రవి గారు చాలా పాజిటివ్ వ్యక్తి. మా సినిమాని ఆడియెన్స్ వరకు రీచ్ చేసిన మీడియాకి థాంక్స్’ అని అన్నారు.

రాయంచ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీని మీడియా ముందుండి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇది నాకు తొలి చిత్రం. ఇంత పాజిటివ్ వైబ్స్ చూస్తుండటం ఆనందంగా ఉంది. దీనంతటికి మా దర్శక, నిర్మాతలే కారణం. నాకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్‌కి థాంక్స్. మా సినిమాని ఇంకా ఇలానే ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

విషిక మాట్లాడుతూ .. ‘మహిళా ప్రేక్షకులు ‘పురుష:’ మూవీని చూసి ఎక్కువగా ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన వీరు గారికి థాంక్స్. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన కోటేశ్వరరావు గారికి థాంక్స్. సినిమాని చూసిన వాళ్లు మళ్లీ చూడండి.. చూడని వాళ్లు వెంటనే వెళ్లి చూడండి’ అని అన్నారు.

హాసిని సుధీర్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీని మీడియా చాలా బాగా ప్రమోట్ చేసింది. మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరం కష్టపడి ఈ చిత్రాన్ని చేశాం. ఇంకా చూడని వాళ్లు ఉంటే వెంటనే అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

నటి సంధ్య మాట్లాడుతూ .. ‘‘పురుష:’లో నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు. కెమెరామెన్ సతీష్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీ విషయంలో కోటేశ్వరరావు గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పవన్ కళ్యాణ్‌కి సక్సెస్ రావడం ఆనందంగా ఉంది. ఇలానే మా జర్నీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ .. ‘‘పురుష:’ మూవీని సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.