Home  »  News  »  'కరుప్పు' కలెక్షన్ల సునామీ.. కేక్ కట్ చేసి త్రిష, సూర్య సంబరాలు!

Updated : May 24, 2026

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సౌత్ క్వీన్ త్రిష కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ 'కరుప్పు' (తెలుగులో ‘వీరభద్రుడు’). థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో, సినిమా సాధించిన భారీ విజయానికి కృతజ్ఞతగా చిత్ర బృందం ఘనంగా సంబరాలు జరుపుకుంది. చిత్ర కథానాయిక త్రిష ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో మూవీ టీమ్ అంతా ఒకచోట చేరి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలో హీరోయిన్ త్రిష, హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ ముఖ్య ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా త్రిష అందరి సమక్షంలో కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేశారు.

తనను, తన సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు త్రిష మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయగా, సూర్య, త్రిషల అభిమానులు ఆ వీడియోను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

'కరుప్పు' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 220 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. సూర్య పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, త్రిష యాక్టింగ్, మరియు ఆర్జే బాలాజీ అద్భుతమైన స్క్రీన్ ప్లే, దర్శకత్వ ప్రతిభే ఈ భారీ విజయానికి కారణమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు వెర్షన్ ‘వీరభద్రుడు’ కూడా రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.