Home  »  News  »  Puri Jagannadh: వాళ్ళని ఎవరు ఓడించలేరు.. పూరి జగన్నాధ్ ఆ హీరోల గురించి భలే చెప్పాడు 

Updated : May 23, 2026

 


స్టార్ డైరెక్టర్ ఈ సారి హిట్ ని తన కాంపౌండ్ లో ఉంచుకోవాలని విజయ్ సేతుపతి తో స్లమ్ డాగ్  33 టెంపుల్ రోడ్ ని తెరకెక్కిస్తాన్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుండగా ఈ చిత్రంతో పూరి మళ్ళీ తన సత్తా చాటాలని ఫ్యాన్స్ చాలా బలంగా కోరుకుంటున్నారు.ఇక పూరి సినిమాల్లో బిజీగా ఉన్నా సరే 'పూరి మ్యూజింగ్స్" ద్వారా పలు జీవిత సత్యాలకి సంబంధించిన అంశాలపై నెటిజన్స్, అభిమానులతో  పంచుకుంటూ ఉంటారు. 

రీసెంట్ గా 'యాటిట్యూడ్"  గురించి మాట్లాడుతు నీ యాటిట్యూడ్ వల్ల నీ చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచం ఏమీ మారిపోదు, కానీ నీ లోపల ఉన్న అంతర్గత ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. జీవితంలో ఎదురయ్యే విపత్తులని  మనం ఎలా స్వీకరిస్తామనేది పూర్తిగా మన మానసిక దృక్పథం పైనే ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషి తన ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే, ఎంతటి కష్టమైన పరిస్థితులనైనా ఎదిరించి నిలబడగలరు

దీనికి ఉదాహరణగా ఒకసారి సముద్రంలో సంభవించిన పెను తుపాను దాటికి రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఆ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన ఒక వ్యక్తి రోడ్డుపై కూర్చుని విపరీతంగా ఏడుస్తూ కుంగిపోతాడు. అదే ప్రమాదం బారిన పడిన మరొక వ్యక్తి మాత్రం, ఒక చెట్టు కొమ్మను పట్టుకుని వేలాడుతూ నవ్వుతో కనిపిస్తాడు. ఇక్కడ ఒకరు సర్వం కోల్పోయానని బాధపడితే, మరొకరు ప్రాణాలతో బతికి ఉన్నందుకు సంతోషపడతాడు. అంటే, మన చుట్టూ జరిగే సంఘటనలు అందరికీ ఒకేలా ఉన్నా, వాటిపై మనం చూపే స్పందన మాత్రమే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.

మీలో గనుక ఎప్పుడూ నెగెటివ్ మైండ్  ఉంటే, దేవుడు ఇచ్చే దీవెనలు కూడా మీకు దరిద్రంగానే అనిపిస్తాయి. అదే మీరు కాన్షియస్ మైండ్ అంటే  స్పృహతో కూడిన మనసుతో ఉంటే, జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం  ఒక సరికొత్త అవకాశంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఏ సంఘటన  కేవలం నీకు మాత్రమే వ్యతిరేకంగా జరగదు. విశ్వంలో ప్రతిరోజూ ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, అందులో నువ్వు  కేవలం ఒక భాగస్వామి  మాత్రమే. ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే మనకు సరైన యాటిట్యూడ్ ఎంతగానో సాయం చేస్తుంది. ఎప్పుడూ ఏడుస్తూనే బతకాలని అనుకునే వాళ్లకి ఈ ప్రపంచంలో ఏడవడానికి రోజూ వేల కారణాలు కనిపిస్తాయి.

బయట సమాజంలో జరిగే దేనిపైనా మనకు నియంత్రణ ఉండదు. కానీ, వాటిని చూసి మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది మాత్రం 100 శాతం మన చేతుల్లోనే ఉంటుంది. రైట్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఈ ప్రపంచంలో ఎవరూ, ఎప్పటికీ ఓడించలేరు. ఎందుకంటే అలాంటి వ్యక్తి జీవితానికి ఎప్పుడూ ఎదురెళ్లడు. కాలంతో పాటు, జీవితమనే ప్రవాహంలో ఒదిగిపోతూ కొట్టుకుపోతుంటాడు కాబట్టి అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. వర్షం వస్తే తడవాల్సిందే, ఎండ తీవ్రంగా ఉంటే ఆ వేడిని భరించాల్సిందే. అప్పుడే మనలో నిజమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి భయపడే బలహీనమైన లక్షణం మీలో ఉంటే, దాన్ని నెమ్మదిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

Also read: Sneha Ullal: 16 ఏళ్లకే సినీ ఎంట్రీ ఎందుకు ఇవ్వాల్సివచ్చిందంటే..స్నేహ ఉల్లాల్ భావోద్వేగం

ఈ సమాజంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. మన క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు కానీ, మనం ఒరిజినల్‌గా ఉంటే చాలు. ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం ఎవరి కోసమో నటించాల్సిన అవసరం లేదు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మన సింప్లిసిటీలోనే స్పష్టంగా అర్థమవుతుంది. జీవితంలో వచ్చే ఎన్నెన్నో కష్టాలన్నింటినీ తట్టుకోవాలన్నా, కింద పడినా మళ్లీ ఫీనిక్స్ పక్షిలా పైకి లేవాలన్నా, గమ్యం వైపు వేగంగా పరిగెత్తాలన్నా మనకు ప్రాథమికంగా కావాల్సింది ఒకే ఒక్కటి యాటిట్యూడ్ అని పూరి తెలిపాడు. 

 

   






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.