Home  »  News  »  Manchu Manoj: 'వడ్డీ కాసుల వాడ' అంటున్న మంచు మనోజ్.. తిరుపతిలో కాలేజ్ కడతాడంట!

Updated : May 20, 2026

రాకింగ్ మంచు మనోజ్ (Manchu Manoj) స్టైలిష్‌ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్దమైంది. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై 'వడ్డీ కాసుల వాడ' సినిమాను ప్రకటించారు. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘వడ్డీ కాసుల వాడ’ టైటిల్ కాన్సెప్ట్ వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. 

టైటిల్ క్యాచీగా ఉండడం, మనోజ్ మ్యానరిజానికి తగ్గట్టుగా ఉండడంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంది. వీరి కాంబినేషన్ లో 2010లో బిందాస్ సినిమా వచ్చింది. బిందాస్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇన్నాళ్లకు హీరో మనోజ్ మళ్లీ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో బ్యానర్ తో జతకట్టడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

బిందాస్ సినిమాకు ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మళ్లీ అదే వైబ్‌ను చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది. టైటిల్ కాన్సెప్ట్ వీడియోలో మనోజ్ తనదైన కామెడీ టైమింగ్‌ ని చూపించారు. మనోజ్ అంటే ఎనర్జీ, హ్యూమర్ అని తెలిసిందే. మరోసారి అదే స్థాయి పెర్ఫార్మెన్స్ ను వడ్డీ కాసుల వాడలో చూడబోతున్నామని తాజా వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇక మనోజ్ నుంచి ఓ సాలిడ్ కమర్షిల్ సినిమా కోరుకుంటున్న ఫ్యాన్స్‌ కు వడ్డీ కాసుల వాడ ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. 

మన జీవితంలో ఈఎంఐలు భాగమైపోయాయి. అదే కాన్సెప్ట్ తో వడ్డీ కాసుల వాడ రూపొందుతుంది. అప్పుల బాధకు కావాల్సినంత హాస్యాన్ని జోడించినట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో మనోజ్ దేవుడిని కోరుకోవడం చూస్తే నవ్వు ఆగదు. నన్ను ధనవంతుడిని చేస్తే.. తిరుపతిలో కాలేజ్ పెట్టి 25 పెర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని.. తన తండ్రి మోహన్ బాబు మోడ్యులేషన్ లో చెప్పడం హైలైట్ గా నిలిచింది. మొత్తానికి ఆయనకు ఉన్న ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు తనదైన స్టైల్ లో దేవిడిని మొక్కడం చూస్తుంటే ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది.

తేజ్ ఉప్పలపాటి రచన, దర్శకత్వంలో పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వడ్డీ కాసుల వాడ రూపొందుతోంది. ఈ సినిమాతో వింటేజ్ మనోజ్ ఎనర్జీ, ఆయన కామెడీ టైమింగ్ చూడబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అలాగే అందరికి కనెక్ట్ అయ్యే కథ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫుల్ మీల్స్ అందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. 

మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోకు వస్తున్న స్పందనకు సంతోషం వ్యక్తం చేస్తూ.. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందిస్తామని పేర్కొన్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ నేతృత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిశోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.