Home  »  News  »  Kajal Aggarwal: హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఎందుకు ఉండరు.. నిజం చెప్పేసిన కాజల్

Updated : May 18, 2026


హీరో గాని, హీరోయిన్ గాని రిలేషన్ లో ఉంటే తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోను చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సినిమాలో చూపించినట్టుగా రిలేషన్ అనేది వెంటనే ఏర్పడదు. అయినా ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఏర్పడకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. వీటి గురించే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో టాలీవుడ్ చందమామ నుంచి సీనియర్ హీరోయిన్ గా మారాల్సి వచ్చిన కాజల్ అగర్వాల్(Kajal Aggarwal)చెప్పుకొచ్చింది. మరి ఆ మాటలేంటో చూద్దాం.

కాజల్ మాట్లాడుతు హీరోయిన్‌గా ఒక స్థాయికి చేరుకున్నాక ఒక ప్రాజెక్ట్ తర్వాత మరొకటి, నిరంతర షూటింగ్‌లు, కంటిన్యూస్ ట్రావెలింగ్, సినిమా ప్రమోషన్లతో రోజులు ఎలా గడిచిపోతాయో కూడా తెలియదు. ఆ విధంగా  తీవ్రమైన వర్క్ ప్రెజర్ ,టైట్ షెడ్యూల్స్ కారణంగా వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించడం చాలా కష్టంగా మారుతుంది  ఏదైనా ఒక బంధం నిలబడాలన్నా, ఒక సీరియస్ రిలేషన్‌షిప్‌ ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నా పరస్పరం సమయం ఇవ్వడం ఎంతో ముఖ్యం, కానీ హీరోయిన్ల లైఫ్‌లో అదే అతిపెద్ద సమస్య. అందుకే చాలా మంది హీరోయిన్స్  ఇంటర్వూస్ లో మాట్లాడుతు  రిలేషన్‌షిప్‌లో లేమని, బాయ్‌ఫ్రెండ్ లేరని చెప్తుంటారు. ఎదుగుతున్న వయసులో క్రష్‌లు ఉండటం చాలా సహజం. హీరోయిన్స్ అందుకు అతీతులేమి కాదు. నాకు  కాలేజీ రోజుల్లో కొన్ని క్రష్‌లు ఉండేవి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టాల్సి వచ్చిందని ఆమె వివరించారు.


Also read: Rashmika Mandanna: బాంబు పేల్చిన రష్మిక.. అది విజయ్ దేవరకొండ కోసం కాదు


2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని  వివాహం చేసుకున్న కాజల్  కొంత గ్యాప్ తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రెజెంట్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మూవీతో బిజీగా ఉంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.