Home  »  News  »  Ram Charan vs NTR: రామ్ చరణ్ vs ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Updated : May 16, 2026

టాలీవుడ్ లో ఒకే సమయంలో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన భారీ అప్‌డేట్స్ రావడం ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగానే ఉంటుంది. అందునా గ్లోబల్ వైడ్‌గా 'ఆర్ఆర్ఆర్' సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR)ల చిత్రాల ప్రమోషన్స్ ఒకేసారి షురూ అవుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ, ఈ ఇద్దరు పాన్-ఇండియా స్టార్స్ తమ అఫీషియల్ ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ముంబై వేదికను ఎంచుకోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్యాక్-టు-బ్యాక్ ధమాకా అప్‌డేట్స్‌తో సోషల్ మీడియాలో మెగా, నందమూరి అభిమానుల హడావిడి పీక్స్‌కు చేరింది.

ముందుగా రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (Peddi) చిత్ర ట్రైలర్ లాంచ్‌కు సంబంధించి మేకర్స్ ఒక భారీ సర్ప్రైజ్ ఇచ్చారు. మొదట ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను భోపాల్‌లో నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించినప్పటికీ, తాజాగా ఈ వేదికను ముంబైకి మార్చారు. మే 18న ముంబైలో జరగబోయే ఒక గ్రాండ్ ఈవెంట్‌లో 'పెద్ది' ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ విలేజ్ క్రికెటర్‌గా, అలాగే పవర్‌ఫుల్ పెద్ది పహిల్వాన్‌గా రెండు భిన్నమైన రగ్గడ్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై నార్త్ బెల్ట్‌లో భారీ హైప్ క్రియేట్ చేయడానికి ముంబై ట్రైలర్ లాంచ్ ఒక పెద్ద బూస్ట్‌లా నిలవనుంది.

ఇక రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్ హడావిడి ముగిసిన మరుసటి రోజే, అంటే మే 19న నందమూరి అభిమానుల వంతు రానుంది. కేజీఎఫ్, సలార్ చిత్రాల సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon) నుండి ఒక స్పెషల్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేయనున్నారు. ముంబైలో నేషనల్ మీడియా సమక్షంలో ఈ గ్లింప్స్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కాగా, అభిమానులకు ఒకరోజు ముందే మే 19న అర్ధరాత్రి ఈ గ్లింప్స్ బ్లాస్ట్ రాబోతుండటంతో పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ముంబై వేదికగా రామ్ చరణ్ 'పెద్ది' ట్రైలర్, ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్ బ్యాక్-టు-బ్యాక్ రోజుల్లో సందడి చేయనుండటంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ముంబై వైపే చూస్తోంది. నార్త్ మార్కెట్‌ను కొల్లగొట్టడమే లక్ష్యంగా ఇరు చిత్రాల నిర్మాతలు ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌ ప్లాన్ చేశాయి. మరి ఈ రెండు అప్డేట్స్ ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.