Home  »  News  »  KD The Devil Review Telugu: 'కేడీ: ది డెవిల్' మూవీ రివ్యూ 

Updated : May 15, 2026

కన్నడ యాక్షన్ స్టార్ ధ్రువ్‌ స‌ర్జా, దర్శకుడు ప్రేమ్ కాంబినేషన్‌లో రూపొందిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'కేడి (KD) - ది డెవిల్'. నేడు (మే 15) ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. (KD The Devil Movie Review)

కథ:
1970-80ల నాటి బెంగళూరు నేపథ్యంలో సాగే కథ ఇది. కాళిదాస్ అలియాస్ కాళి (ధ్రువ్‌ స‌ర్జా) సాధారణ జీవితం సాగిస్తుంటాడు. 25 ఏళ్లుగా ఓ ముఠా నాయ‌కుడిగా కొనసాగుతున్న దేవా (సంజ‌య్‌ద‌త్‌) అంటే కాళికి చాలా ఇష్టం. అనుకోకుండా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల కార‌ణంగా.. కాళిని, అతని కుటుంబాన్ని మ‌ట్టుబెట్టాల‌ని దేవా గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. అప్ప‌టివరకు దేవాను ఎంతో ఆరాధిస్తూ తిరిగిన కాళి.. త‌న కుటుంబం కోసం ఆయుధం పట్టి, దేవాకు ఎదురునిలబడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
సింపుల్ గా చెప్పాలంటే.. దేవాను ఆరాధించే స్థాయి నుంచి అతనికి సమానంగా నిలబడే స్థాయికి కాళీ ఎలా ఎదిగాడనేదే ఈ చిత్ర కథాంశం. ఈ తరహా అండర్ వరల్డ్ కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. కథలో కొత్తదనం లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం ప్రధాన మైనస్ గా మారింది. దర్శకుడు ప్రేమ్ కేవలం హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్‌పైనే దృష్టి పెట్టారు తప్ప, బలమైన ఎమోషన్స్ పండించడంలో తడబడ్డారు. ఫస్ట్ హాఫ్ కాస్త ఆసక్తికరంగా ఉన్నా, సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా గాడి తప్పింది. క్లైమాక్స్ కూడా ఊహించదగ్గ రీతిలో ఉంటుంది.

1970ల కాలం నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ కథ.. అప్పటి మాస్, క్రైమ్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు యాక్షన్ ప్రియులకు కావాల్సిన విందును దర్శకుడు అందించారు. ధ్రువ సర్జా, సంజయ్ దత్ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకున్నాయి. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి, భారీ యాక్షన్ కోరుకునే వారికి 'కేడీ: ది డెవిల్' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
మాస్ హీరోగా ధ్రువ సర్జా తన నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో తన ఎనర్జీని ప్రదర్శించాడు. రీష్మా నానయ్య హీరోయిన్‌గా తన పరిధి మేర చక్కగా నటించింది. సీనియర్ నటుల ఉనికి సినిమాకు ఒక లెవల్ క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా సంజయ్ దత్ తన గంభీరమైన నటనతో మెప్పించారు. శిల్పా శెట్టి చాల కాలం తర్వాత ఒక బలమైన పాత్రతో ప్రేక్షకులను పలకరించారు.

విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ 70-80ల నాటి వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించింది. అర్జున్ జన్యా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేశాయి. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్ ఆ కాలానికి తగ్గట్లుగా సహజంగా ఉన్నాయి. సినిమా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్:
ధ్రువ సర్జా పర్ఫార్మెన్స్
టెక్నికల్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథనం
ఓవర్ బిల్డప్స్
సెకండ్ హాఫ్

ఫైనల్ గా..
'కేడి - ది డెవిల్' కేవలం మాస్ యాక్షన్ ప్రియులను మాత్రమే టార్గెట్ చేసిన సినిమా. ఓవర్ ది టాప్ యాక్షన్, రొటీన్ మాఫియా డ్రామా కావాలనుకునే వారు ఒకసారి చూడొచ్చు. కానీ, కథలో లోతును ఆశించే ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగిస్తుంది.

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.