Home  »  News  »  Manasa Varanasi vs Mamitha bhaiju: ఎంత పని జరిగిపోయింది.. ఒకరి ప్లేస్ లో మరొకరు!

Updated : May 10, 2026

 


ఒకరి అవకాశాలని ఒకరు అందిపుచ్చుకోవడం అనేది సినీ ఇండస్ట్రీలో కామన్. ప్రెజెంట్ క్రేజ్ ని బట్టి మేకర్స్ తమ సినిమాలో పలానా వాళ్ళు ఉంటే తమ సినిమాకి ఉపయోగమని  కోరుకోవడమే అందుకు కారణం. అంతే కానీ సినిమా కథలగా పగలు, కుట్ర కుతంత్రాలు ఉండవు. ఈ కోవలోనే ప్రేమలు, డ్రాగన్  బ్యూటి మమిత భైజు(Mamitha bhaiju)ప్లేస్ లో కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ మానస వారణాసి(Manasa Varanasi)వచ్చి చేరిందనే న్యూస్ వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.

శర్వానంద్, శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబోలో ‘జార్జ్ క్రిష్’అనే మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా బ్యానర్  మైత్రీ మూవీ మేకర్స్  ప్రెస్టేజియస్ట్ గా రూపొందిస్తుంది. తొలుత  హీరోయిన్‌ గా మమితా బైజుని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అధికార ప్రకటన రావడమే తరువాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు మానస వారణాసిని  ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది.. కపుల్ ఫ్రెండ్లీ లో మిత్రా క్యారక్టర్ ని అత్యద్భుతంగా పోషించింది. ప్రభాస్ సైతం మానస పెర్ఫార్మ్ ని మెచ్చుకున్నాడు. మరి ఈ వార్త నిజం అయితే మానస వారణాసికి మంచి అవకాశమని చెప్పవచ్చు మరోవైపు శర్వానంద్ ఇప్పటికే  తన లుక్ పై కసరత్తులు చేస్తున్నాడు. బైకర్ కోసం సన్నబడ్డ శర్వా జార్జ్ క్రిష్  కోసం కొంచెం వెయిట్ పెరగబోతున్నాడు.

 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. శ్రీను వైట్ల గత చిత్రం ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన సత్తా చాటాలనే పట్టుదలతో  శ్రీను వైట్ల  ఉన్నాడు.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.