![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు శనివారం సాయంత్రం సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తిగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ కి సర్జరీ జరిగిందని అధికారికంగా తెలియడంతో.. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు రెట్టింపు ఉత్సాహంతో, పూర్తి ఆరోగ్యంతో త్వరలోనే మళ్ళీ ప్రజా సేవలోకి రావాలని ఆశిస్తున్నాను" అని తారక్ రాసుకొచ్చారు.
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. పలు ఈవెంట్స్ లో ఇద్దరూ కలిసి సందడి చేశారు. ఒకరి సినిమా కార్యక్రమాల్లో మరొకరు పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ తాజా ట్వీట్ వీరి మధ్య బాండింగ్ ను తెలియజేస్తోంది.
https://x.com/tarak9999/status/2045748836812132483
![]() |
![]() |