![]() |
![]() |

-అందానికి సరికొత్త పేరు భాగ్యశ్రీ బోర్సే
-ప్రస్తుతం అఖిల్ తో లెనిన్
-మరి నెక్స్ట్ ఏంటి
-ప్రెజెంట్ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అందంలో గాని, పెర్ఫార్మ్ విషయంలో గాని 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse)నెంబర్ వన్. కానీ ఎందుకనో హిట్ అనేది ఆమెని కనీసం చుట్టపు చూపుగా అయినా పలరించడం లేదు. అందుకుపైన చెప్పుకున్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఎన్నో కారణాలు. కానీ ప్లాప్స్ లో కూడా రష్మిక లాగా నేషనల్ క్రష్ అనే టాగ్ లైన్ ని సొంతం చేసుకుంది. దీన్ని బట్టి అభిమానుల్లో భాగ్యశ్రీకి ఎంతటి చరిష్మా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు భావాన్ని మొత్తం చెప్పేయగలదు. కాంత మూవీనే ఒక ఉదాహరణ.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అఖిల్ అక్కినేని(Akhil Akkineni)తో చేస్తున్న లెనిన్(Lenin)ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. మురళీ కిషోర్(Murali Kishor)దర్శకత్వంలో రూరల్ డ్రామాగా తెరకెక్కుతుండగా'భారతి' అనే పల్లెటూరి అమ్మాయి క్యారక్టర్ లో భాగ్యశ్రీ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'యెట్టా యెట్టా' సాంగ్ ప్రొమోలో అఖిల్‌తో భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూస్తుంటే, ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కొట్టేలా కనిపిస్తోంది. లెనిన్ తప్ప మరో అప్ కమింగ్ మూవీ ఆమె లిస్ట్ లో లేదు. దీంతో ఈ సారి లెనిన్ తో భాగ్యశ్రీ హిట్ ని అందుకొని మరిన్ని సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు.
అన్నట్టు భాగ్యశ్రీ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందమైన డిజైన్ తో చేసిన శారీ ధరించి నీతోనే ఏదో ఊసులాడాలనే విధంగా ఆమె చూపులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ గా మారడంతో తమ జన్మధన్యమైనట్టుగా ఫ్యాన్స్ బావిస్తున్నారు.
aslo read: jacqueline fernandez: ప్రియుడు సుఖేష్ కి జాక్వెలిన్ వెన్నుపోటు.. అప్రూవర్‌గా మారింది భయ్యా
యారియాన్ 2' అనే బాలీవుడ్ మూవీతో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ, రవితేజతో చేసిన 'మిస్టర్ బచ్చన్' తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా,తన అందం, అభినయానికి అందరు ఫిదా అయ్యారు. రామ్ పోతినేనితో చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్‌తో చేసిన 'కాంత' కూడా నిరాశపరిచాయి. మరి 'లెనిన్' ఆడాలని కోరుకుందాం
![]() |
![]() |