Home  »  News  »  Ranveer singh: రణవీర్ సింగ్ అప్ కమింగ్ మూవీ ప్రళయ్.. ఆ పుస్తకంలోని కథేనా!

Updated : Apr 6, 2026

 

-1600 కోట్ల గ్రాస్ తో వీరవిహారం చేస్తున్న రణవీర్ 
-నెక్ట్ మూవీ ప్రళయ్ పై భారీ అంచనాలు 
-కథ ఇదేనా!


ఇక నుంచి రణవీర్ సింగ్ ని ఎవరు పిలవాలన్నా 'ధురంధర్  రణవీర్ సింగ్' అని పిలవడం భారతీయ సినీ మేకర్స్, ప్రేమికులధర్మం. అంతలా ధురంధర్ రెండు భాగాల్లో హంజా అలీ మజారి ఉరఫ్ జస్కి రాత్ సింగ్ గా మెస్మరైజ్ చేసి ధురంధర్ విజయ శాతాన్ని పెంచాడు. కలెక్షన్స్ పరంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తు స్టిల్ 1600 కోట్ల గ్రాస్ తో ఉన్నాడు. దీంతో ధురంధరుడి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన 'ప్రళయ్' పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పక్కర్లేదు. ఉదాహరణగా అంచనాల స్థాయిని  చెప్పినా అంతకు మించి అని చెప్పే ధురంధర్ ఫ్యాన్స్ ఆత్మవిశ్వాసానికి లెక్కే ఉండదు. అందుకే అంచనాల జోలికి వెళ్లకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేద్దాం.

కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో 'బ్లైండ్ నెస్' అనే బుక్ ఆధారంగా 'ప్రళయ్'(Pralay)తెరకెక్కతోందనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. దీంతో 'బ్లైండ్ నెస్' ప్రియులతో గూగుల్ క్రాష్ అయ్యే పరిస్థితి. ఇక ఈ మాత్రం లేటు చేయకుండా  రీసెంట్ గా ఈ విషయంపై  ప్రళయ్ ప్రొడ్యూసర్ 'హన్సల్ మెహతా' స్పందిస్తు ప్రళయ్ మూవీ ఏ పుస్తకం ఆధారంగా తెరకెక్కడం లేదు. అసలు పుస్తకాన్ని సినిమాగా తీసుకురావడం అంత ఈజీ కాదు. దర్శకుడు జై మెహతా చాలా సంవత్సరాల నుంచి ప్రళయ్ కోసం వర్క్ చేస్తున్నాడు. స్క్రిప్ట్ బాగా వస్తుంది. సదరు స్క్రిప్ట్ తో పాటు జై మెహతా(Jai Mehta)పై రణవీర్ కి చాలా నమ్మకం ఉంది. బాలీవుడ్ చిత్రాల్లో ఇంతవరకు చూడని సరికొత్త వరల్డ్ ప్రళయ్ ద్వారా ప్రత్యక్షం కాబోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో బ్లైండ్ నెస్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది.

Also read: Dacoit: డెకాయిట్ రిలీజ్ వేళ మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తన అజెండా అదేనంట 

ఇక ప్రళయ్ జోనర్ కి వస్తే జాంబీ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. జాంబీ థ్రిల్లర్ అంటే జీవించి ఉన్న వ్యక్తులపై దాడి చేసి, వారి రక్తాన్ని తాగడంతో పాటు  మాంసాన్ని తినే ఒక అరుదైన రాక్షస జాతి కథలు. ప్రాచీన డెవిల్స్ కథలుగా కూడా   చెప్పుకోవచ్చు. జాంబీ రెడ్డి, కొత్త లోక చాప్టర్ 1 చిత్రాలు కూడా ఒక ఉదాహరణ. హాలీవుడ్ లో 1970  నాటి నుంచే తెరకెక్కిస్తూ ఉన్నారు. బ్లైండ్ నెస్  బుక్ లో ఉన్న విషయానికి వస్తే   పేరు చెప్పని నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న, వివరించడానికి కూడా వీలు లేని సామూహిక అంధత్వ మహమ్మారి చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. సామాజిక పతనాన్ని ఎదుర్కొంటున్న అనేక క్యారెక్టర్స్ కూడా బుక్ లో కనపడుతూ ఉంటాయి  పోర్చు గీసు రచయిత 'జోస్ సరమగో'(Jose saramago)1995 లో రచించాడు.

 



 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.