Home  »  News  »  Peddi: పెద్దితో మృణాల్ ఠాకూర్!

Updated : Mar 23, 2026

 

-ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ రిలీజ్ 
-చరణ్ పుట్టిన రోజున అప్ డేట్స్ వస్తాయా!
-తెరపైకి వచ్చిన మృణాల్ 

 

అన్ని సినిమాల టీజర్లు, అన్ని సినిమాల పాటలు ఒకలా ఉండవని ఈ మధ్య కాలంలో నిరూపించిన చిత్రం 'పెద్ది'(Peddi). పైగా ఈ విషయంలో చాలా సినిమాలు 'పెద్ది'ని ఇన్ స్ప్రెషన్ తీసుకుంటున్నాయి. ఇక అభిమానులు, పాటల ప్రేమికులు అయితే డైలీ పెద్ది సాంగ్స్ ని వినకుండా తమ దినచర్యని స్టార్ట్ చేయడం లేదంటే నమ్మండి. ముఖ్యంగా 'రై రై రా' సాంగ్  అయితే ప్రతి ఒక్కరి లైఫ్ కి ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. దీంతో పెద్ది సినీ సొసైటీ పట్ల ఎంత సిన్సియర్ గా ఉంటాడో అర్ధమవుతుంది. రీసెంట్ గా 'పెద్ది' గురించిన ఒక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో చాలా సిన్సియర్ గానే చక్కర్లు కొడుతుంది. మరి అదేంటో చూద్దాం.

పెద్దిలో స్పెషల్ సాంగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో చరణ్(Ram Charan)కి పోటీగా డాన్స్ చేసే ముద్దగుమ్మల  విషయంలో కొన్ని రోజుల నుంచి  పలు రకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మృణాల్ ఠాకూర్‌(Mrunal Thakur)పేరు వినిపిస్తుంది. వినిపించడం మాత్రమే కాదు చరణ్ తో ఆడిపాడటం ఖాయమనేది సినీ సర్కిల్స్ టాక్. మృణాల్ రీసెంట్ గా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. సదరు పిక్స్ లో మృణాల్ హైదరాబాద్ లో ఉన్నట్లుగా అర్ధమవుతుంది. అడవి శేష్ తో డెకాయిట్ చేస్తుంది కదా అందుకని ఉందని అనుకోవచ్చు. కానీ డెకాయిట్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఏప్రిల్ 10 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మృణాల్ తన పెద్ది బావ కోసమే ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మృణాల్ గోల్డెన్ లెగ్ కూడా  పెద్దితో జత కడితే పెద్దిని ఆపడం ఎవరి తరం కాదు.

Also read: Dhurandhar 2: ధురంధర్ 2 నిజమైన కలెక్షన్స్ ఇవే.. బాహుబలి, కల్కి,ఆర్ఆర్ఆర్ ని క్రాస్ చేసిందంటారా! 


పెద్ది  ఈ నెల  27న తన పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. దీంతో అభిమానులు పెద్ది నుంచి ఎన్నో రకాలుగా ఆశిస్తున్నారు. ఆ ఆశలన్నిటిని తీర్చే దిశగా  దర్శకుడు బుచ్చిబాబు ఉన్నాడనే వార్తలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సాంగ్ కానీ టీజర్ కానీ రావచ్చేమో. దురాభిమానులకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే పెద్ది రిలీజ్ వాయిదా పడటం లేదు. ఏప్రిల్ 30 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. చరణ్ సరసన అచ్చాయమ్మాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor)కనిపిస్తుండగా ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)మిగతా సాంగ్స్ ద్వారా పెద్ది రేంజ్ మరింతగా పెంచాలని చూస్తున్నాడు. త్వరలోనే ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.