Home  »  News  »  Sreeleela: సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నా.. శ్రీలీల ఎమోషనల్ కామెంట్స్!

Updated : Mar 22, 2026

టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela). తన డాన్సులతో, చలాకీతనంతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ భామ.. తాజాగా సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయిపోయింది.

కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో కొన్ని ఫ్లాప్ లు ఎదురుకావడంతో.. నెటిజన్లు తనపై దారుణంగా ట్రోల్స్ చేశారని శ్రీలీల గుర్తు చేసుకుంది. "నేను చాలా సెన్సిటివ్, ఆ కామెంట్స్ చూసి తట్టుకోలేక చాలాసార్లు ఏడ్చేశాను" అంటూ తనలోని బాధను బయటపెట్టింది. ఒకానొక దశలో సినిమాలకు గుడ్ బై చెప్పాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

ట్రోల్స్ భరించలేక తన తల్లి దగ్గరకు వెళ్లి.. "అమ్మా, ఇవన్నీ నా వల్ల కావడం లేదు.. నేను మళ్ళీ కాలేజీకి వెళ్లి చదువుకుంటాను" అని ఎమోషనల్ అయినట్లు శ్రీలీల వెల్లడించింది. అయితే, తన తల్లి ఇచ్చిన ధైర్యంతోనే మళ్ళీ నిలబడ్డానని, ఇప్పుడు అలాంటి ట్రోల్స్ ని ధైర్యంగా ఎదుర్కొంటున్నానని శ్రీలీల చెప్పుకొచ్చింది.

కెరీర్ పరంగా చూస్తే, 'పెళ్లి సందడి'తో ఎంట్రీ ఇచ్చి 'ధమాకా'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రీలీల. ఆ తర్వాత 'భగవంత్ కేసరి'లో తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే అప్పటినుంచి శ్రీలీలను ఎక్కువగా ఫ్లాప్ లే పలకరించాయి. 

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) సినిమాలో మెరిసింది శ్రీలీల. ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మంచి వసూళ్లనే రాబడుతోంది. 

ప్రస్తుతం శ్రీలీల కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా భారీ ఆఫర్లను అందుకుంటోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ట్రోలర్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎంత నెగెటివిటీ ఉన్నా, తన హార్డ్ వర్క్ తోనే సమాధానం చెబుతానని అంటోంది ఈ డ్యాన్సింగ్ క్వీన్.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.