Home  »  News  »  Varalaxmi Sarath Kumar: సరస్వతి రిలీజ్ ఎప్పుడో తెలుసా!.. బయటకొచ్చిన శరత్ కుమార్, రాధిక నిజాలు  

Updated : Mar 3, 2026

 

-వరలక్ష్మి శరత్ కుమార్ మరో నట విశ్వరూపం 
-దర్శకురాలిగా హిట్ ని అందుకుంటుందా!
-ట్రైలర్ తో భారీ అంచనాలు 

ఆడ అయినా, మగ అయినా సినీ వారసత్వం పొందడం సులభం. కానీ వారసత్వాన్ని మించిన గుర్తింపు తెచ్చుకోవడం ఏ కొద్దీ మంది వల్లనో అవుతుంది. ఆ కొద్దీ మందిలో వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarath kumar)ఒకరు. సుప్రీం స్టార్ శరత్ కుమార్(Sarath Kumar)నట వారసురాలిగా అడుగుపెట్టి తన కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేసే స్థాయికి ఎదిగింది. ఇప్పుడు 'సరస్వతి' అనే మూవీతో దర్శకురాలిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించి ఈ నెల 6 న సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టనుంది. కొత్త ప్రయాణం అని అనుకుంటుంది గాని సరస్వతి ట్రైలర్ రిలీజ్ తర్వాత కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోవడం లేదు. ట్రైలర్ తోనే సినిమా పరిస్థితి అర్ధమవుతుంది. రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా  శరత్ కుమార్, తల్లి రాధిక, సోదరి పూజ, భర్త నికోలయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి  పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు మీకోసం. 

శరత్ కుమార్ మాట్లాడుతు నటిగా ఎంత బిజీగా ఉన్నా దర్శకురాలిగా మారాలనే నిర్ణయం వరలక్ష్మికి చాలా స్పష్టంగా ఉంది. సెట్‌లో పనితీరుని చూసి ఆశ్చర్యపోయాను. సినిమాకి సంబంధించి ఏం కావాలో  ముందే తెలుసు. చాలా ఫోకస్ గా పని చేసింది. పాతకాలపు దర్శకుల్లాగా, మానిటర్ల సహాయం లేకుండానే షాట్ ఓకే చేయగలిగే నైపుణ్యం సొంతం. ఒక్కోసారి నిద్ర లేకుండా పని చేసేది. మల్టీటాస్కింగ్ చేయడంలో చాలా సమర్థురాలు. ఒక తండ్రిగా నా కూతుర్ని 'లయన్ హార్ట్' (Lion Heart) అని పిలవడం తన  ధైర్యానికి, సంకల్పానికి నిదర్శనమని శరత్ కుమార్  చెప్పుకొచ్చాడు.

మిగతా వారు కూడా మాట్లాడుతు సరస్వతి కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, సమాజంలోని మహిళల కోసం ఒక బలమైన సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం. 'సరస్వతి' అంటే వరలక్ష్మికి ఒక విజన్. మహిళలని తక్కువ అంచనా వేయకూడదని, వారికి ఉండాల్సిన గౌరవం మరియు హక్కుల గురించి  మాట్లాడుతుంది. తన నిజ జీవితంలో కూడా ఫెమినిజం, స్త్రీత్వం (Femininity) మధ్య సమతుల్యతని పాటిస్తూ, అవే విలువలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు వరలక్ష్మి. సింపుల్ గా చెప్పాలంటే సరస్వతి’మూవీ విజన్ మహిళా సాధికారత.

వరలక్ష్మి సోదరి పూజ నిర్మాతగా కీలక పాత్ర పోషించడంతో పాటు అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే అనుబంధం పని దగ్గరకి వచ్చేసరికి  ప్రొఫెషనల్ గా ఉండేది. ఒకరి సృజనాత్మకతలో మరొకరు జోక్యం చేసుకోకుండా, ఒకరినొకరు నమ్ముతూ ‘సరస్వతి’ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రాధిక గారి క్యారక్టర్ మూవీలో చాలా ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. వారసత్వాన్ని బాధ్యతగా స్వీకరించి, తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైన వరలక్ష్మి శరత్ కుమార్ గారి ‘సరస్వతి’ మనందరినీ ఆలోచింపజేస్తుందని ఆశిద్దాం. ఒక కూతురి ఎదుగుదలను చూసి మురిసిపోయే తండ్రి, తోడుగా నిలిచే సోదరి, అండగా ఉండే కుటుంబం... ఇవన్నీ కలిస్తేనే 'సరస్వతి'.ఈ సంభాషణ కేవలం సినిమా గురించే కాదు, ఒక కుటుంబం మధ్య ఉండే బంధం, వృత్తి పట్ల వారికి ఉన్న అంకితభావం గురించి కూడా చెబుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్, రాధిక తో పాటు ప్రియమణి(Priyamani),ప్రకాష్ రాజ్(Prakash Raj)చేస్తుండటం సరస్వతి కి ఉన్న మరో బలమైన అట్రాక్షన్. థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కింది.


also read:  Peddi.. 1000 కోట్లు పక్కా!.. ఈ ఇద్దరే సాక్ష్యం

మరిన్ని ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు మరియు సినిమా అప్‌డేట్స్ కోసం మా తెలుగు వన్ సినిమా(Telugu One cinema) యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి! స్టే ట్యూన్ తెలుగు వన్ సినిమా. ఛానల్ మటుకు మార్చకండి.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.