![]() |
![]() |

-అనిల్ రావిపూడి ఎందుకు ఎలా చెప్పాడు
-వెంకీ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి
-జనవరి 12 మన శంకర వర ప్రసాద్ గారు ద్వారా ఏం జరగబోతుంది
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా, విక్టరీ ఈవెంట్ 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad garu)ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న శిల్ప కళా వేదికగా అత్యంత ఘనంగా జరుగుతూ ఉంది.అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మెగా అభిమానులు భారీగా హాజరయ్యారు. సినీ రంగానికి చెందిన అతిరధ మహారధులు కూడా హాజరైన ఈ వేడుకకి మన శంకర వర ప్రసాద్ గారు త్రయం చిరంజీవి(chiranjeevi),విక్టరీ వెంకటేష్(venkatesh),అనిల్ రావిపూడి(Anilravipudi)లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
also read: ఈ సారి సంక్రాంతి పందెం డైనోసార్ పై వెయ్యండి.. ఓజి గుర్తుందిగా
ఈ ఈవెంట్ లో వెంకటేష్ క్యారక్టర్ గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతు వెంకటేష్ గారు మూవీలో వెంకీ గౌడ గా కనిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వస్తారు. అయన క్యారక్టర్ శంకర వర ప్రసాద్ గారు తో కలిసాక చేసే అల్లరి మాములుగా ఉండదు. థియేటర్స్ లో ప్రేక్షకులని చక్కిలి గిలిగింతలు కలిగించడం పక్కా అని చెప్పుకొచ్చాడు.
.webp)
![]() |
![]() |