![]() |
![]() |

-నాగబాబు సంచలన స్పీచ్
-మనకి ఏ హక్కు ఉంది
-రాజ్యాంగం ఏం చెప్పింది
-ఈ రూల్ తెలియదా!
శివాజీ(Sivaji)ఇటీవల మహిళల వస్త్ర ధారణపై కొన్నికీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు(Nagababu)స్పందిస్తు 'జనసేన కార్యకర్త ఎమ్మెల్సీగా నటుడిగా నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. ఓ సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నాను. అలాగే శివాజీ ని నేను టార్గెట్ చేస్తున్నానని అనుకోవద్దు. మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తుంది. అందుకే ఆడవాళ్ళ డ్రెస్ లు గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు పలానా డ్రెస్ వేసుకోవాలి అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం.
అలా మాట్లాడిన వారికి కూడా ఆడవాళ్ల నుంచి సపోర్ట్ లభించడం దురదృష్టం.ప్రతి అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుంది. అందరూ మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి అలా ఉండాలి అని చెప్పే రైట్ మనకు లేదు. ఆడపిల్లల మీద జరిగే వేధింపులు వాళ్లు ధరించే డ్రస్సుల వల్ల కాదు. మగవాడి క్రూరత్వం, మగవాడి పశు బలం వల్లే వేధింపులు. ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అది సెలబ్రిటీలైనా బయటకు వెళ్లేటప్పుడు వ్యక్తిగతంగా సరైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. దుర్మార్గులున్న మగజాతి ఉన్న సమాజం మనది.
మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో అదే వేసుకోండి. కానీ చెడ్డ పనులు చేయకూడదు. అది చెప్పాలి మీరు. అంతే తప్ప ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అనే హక్కు మనకు లేదు. డ్రెస్సింగ్ సెన్స్ కల్చర్ బట్టి మారుతుంటుంది. ఇది వారి తప్పు కాదు. ఆడవాళ్లకు సరిగ్గా రక్షణ కల్పించలేని ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. మనం AIలోకి వచ్చాం. ఇంకా ఆడపిల్లలు ఇలా ఉండాలనే మనస్తత్వాలను ఖండించాలి.
Also Read: తిరుమల టోకెన్స్ పై విశ్వక్ సేన్ కీలక వ్యాఖ్యలు
ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడూ బాగుపడలేదు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా నా వాయిస్ ఓపెన్ చేయకుంటే తప్పు చేసిన వాడిని అవుతా. మన దేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తుందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయని సదరు వీడియోలో పేర్కొన్నాడు. ఇక శివాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.
![]() |
![]() |