![]() |
![]() |

-పుట్టిన రోజు వేడుకల్లో స్పెషల్ ఇదే
-పలువురు సినీ తారలు రాక
-పెళ్లి న్యూస్ ఇదే
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని చరిష్మా 'సల్మాన్ ఖాన్' సొంతం. బాలీవుడ్ కండల వీరుడుగా, సల్లు భాయ్ గా అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే సల్మాన్ సృష్టించని రికార్డు లేదు. లవ్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, రొమాంటిక్, స్పై థ్రిల్లర్ మూవీస్ లో సుదీర్ఘ కాలం నుంచి చేస్తు యావత్తు భారతీయ సినీ ప్రేమికులని అలరిస్తూ వస్తున్నాడు. ఈ రోజు సల్మాన్ పుట్టిన రోజు. దీంతో అరవై సంవత్సరంలోకి అడుగుపెట్టిన సల్మాన్ కి పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రేమికులు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు.
తన జన్మ దినాన్ని పురస్కరించుకుని సల్మాన్ నిన్న నావి ముంబైలోని పావెల్ లో ఉన్న తన ఫామ్ హౌస్ లో మిడ్ నైట్ ఇచ్చిన పార్టీకి పలువురు తరలి వెళ్లారు. ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, ఆయన భార్య ధోని, సినీ తారలైన సంజయ్ దత్, టబు, హ్యూమా ఖురేషి,సంగీత బిజలానీ, సల్మాన్ తండ్రి, కుటుంబ సభ్యులు ప్రముఖ దర్శకులుతో పాటు రాజకీయనాయకులు, వ్యాపార ప్రముఖులు హాజరయ్యి సల్మాన్ ఆతిధ్యాన్ని స్వీకరించారు. టోటల్ ఫంక్షన్ ఎంతో గ్రాండ్ గా జరగగా, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సల్మాన్ కేక్ కటింగ్ వీడియో అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా సల్మాన్ కి బర్త్ డే విషెస్ చెప్తూనే పెళ్లి న్యూస్ చెప్తామేవో అని ఆశపడ్డాం కదా సల్లు భాయ్ అనే మెసేజ్ చేస్తున్నారు.
Also read: డ్రగ్స్ కేసులో అగ్ర హీరోయిన్ సోదరుడి పరారీ.. గాలింపు చేపట్టిన ఈగల్
ఇక సల్మాన్ కెరీర్ విషయానికి వస్తే గత కొంత కాలంగా వరుస పరాజయాలని ఎదుర్కొంటున్నాడు. అదే కోవలో ప్రీవియస్ మూవీ 'సికిందర్' కూడా భారీ డిజాస్టర్ ని అందుకుంది ప్రస్తుతం 'బాటిల్ ఆఫ్ గల్వాన్' అనే ఇండియన్ ఆర్మీ కి సంబంధించిన సబ్జెట్ చేస్తున్నాడు. రాజా శివాజీ అనే మరో మూవీలో క్యామియో అప్పీరియన్సు ఇవ్వనున్నాడు.
![]() |
![]() |