రష్మిక మందన్నా(rashmika mandanna)రీసెంట్ గా పుష్ప 2(pushpa 2)తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.శ్రీవల్లి క్యారక్టర్ లోని ఆమె నటనకి పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.ప్రస్తుతం ఆమె ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో,చావా,కుబేర,సికిందర్ వంటి పలు క్రేజీ ప్రాజక్ట్స్ లో చేస్తుంది.
రష్మిక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఆమె మాట్లాడుతు నేను విజయ్(vijay)సార్ కి వీరాభిమానిని.నేను స్క్రీన్ మీద చూసిన మొదటి హీరో విజయ్ గారే.ఆయన చేసిన 'గిల్లి' మూవీ అయితే లెక్కకు మించిన సార్లు చూసాను.అందులోని ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం.నా లైఫ్ మొత్తంలో ఎన్నో సార్లు ఆ పాటకి స్టేజీ పై డాన్స్ చేశాను.ఆ మూవీ మహేష్ బాబు హీరోగా తెలుగులో వచ్చిన 'పోకిరి' కి రీమేక్ గా తెరకెక్కిందని చెప్పుకొచ్చింది.కానీ గిల్లి సినిమా 'ఒక్కడు' మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రష్మిక వీడియోని షేర్ చేస్తు గిల్లి మూవీ పోకిరీకి రీమేకా అంటు పలు రకాల కామెంట్స్ తో ఎమోజి లని కూడా షేర్ చేస్తున్నారు.
దీంతో విషయం అర్ధమైన రష్మిక గిల్లి మూవీ ఒక్కడు కి రీమేక్ అని ఇంటర్వ్యూ తర్వాత అర్ధమయ్యింది.ఈ విషయంలో అందరకి సారీ అని సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫన్నీ ఎమోజి లని జోడించింది.