కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(upendra)చాలా సంవత్సరాల తర్వాత 'యూఐ'(ui)అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కన్నడంతోపాటుతెలుగు,తమిళ,హిందీ,మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది.ఇక మూవీ చూసిన చాలా మంది అప్ డేటెడ్ మూవీగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ఏరియాల్లో డివైడ్ టాక్ కూడా వస్తుంది.
ఈ మూవీ తొలిరోజు 6 .75 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని సాధించింది.అందులో కర్ణాటకలో 6 కోట్లు రాబట్టగా,తెలుగులో 70 లక్షలు,తమిళంలో 4 లక్షలు,హిందీలో లక్ష రూపాయిల చొప్పున రాబట్టింది.
మరి వీకెండ్స్ లో ఈ మేర రాబడుతుందో చూడాలి.
ఉపేంద్ర రచనా,దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ మూవీలో రేష్మ నానయ్య హీరోయిన్ గా చెయ్యగా,మురళి శర్మ,రవిశంకర్,అచ్యుత్ కుమార్,సాదు కోకిల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.అజనీష్ లోక్ నాధ్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ మూవీని మనోహరన్,కె పి శ్రీకాంత్ లు సంయుక్తంగా నిర్మించారు.